Rashi Khanna : ఆ హీరోతో రాత్రంతా ఉంచితే.. బాబోయ్ రాశి ఖన్నా మాటలు దారుణం..!
Rashi Khanna : తెలుగులో హిట్ అయిన హిందీ హీరోయిన్ల జాబితాలో హీరోయిన్ రాశి ఖన్నా కూడా ఉంటుంది. తెలుగులో ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని దాదాపు అన్ని భాషల్లోనూ అవకాశాలను అందుకుంటోంది. తెలుగులో అప్పుడప్పుడు హిట్లు అందుకుంటున్న ఈ హీరోయిన్ ఓ హీరో గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు తెలుగులో ఓ హీరోతో బాగా ఫ్రెండ్షిప్ ఉందని హీరోయిన్ రాశి ఖన్నా వివరించింది.
తమ ఇద్దరి మనస్థత్వాలు ఒకేలా ఉంటాయని, ఒకేలా ఆలోచిస్తామని కూడా అమ్మడు చెప్పుకొచ్చింది. వ్యక్తిగత విషయాలను కూడా తామిద్దరం షేర్ చేసుకునేంత చనువు తమ మధ్య ఉందని అసలు విషయం చెప్పింది. దీంతో ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరా హీరో అనే చర్చ నడుస్తోంది. రాశి ఖన్నాతో అంత సన్నిహితంగా ఉండే హీరో ఎవరంటే అక్కినేని నాగచైతన్య. మనం సినిమాలో ఒక సీన్ లో కనిపించిన రాశి ఖన్నా, అక్కినేని నాగచైతన్యల మధ్య మంచి స్నేహం ఉందట.
Rashi Khanna : హీరో ఎవరంటే..
తామిద్దరిని ఒక రూంలో పెట్టి రాత్రంతా వదిలేస్తే.. తెల్లవార్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారట. ‘మా మధ్య బాండింగ్ చాలా స్పెషల్ అని ఇద్దరు టేస్ట్లు.. థింకింగ్ ..ఒకేలా ఉంటుందని’రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. అటు నాగ చైతన్య కూడా రాశి ఖన్నా గురించి మాట్లాడుతూ.. ‘రాశీ ఖన్నా తనకు ఇండస్ట్రీలోనే బెస్ట్ ఫ్రెండ్ అని కచ్చితంగా ఆమెకు అన్ని విషయాలు పర్సనల్ మ్యాటర్స్ కూడా షేర్ చేస్తా’ అని చెప్పడం సంచలనంగా మారింది. అయితే వీరిద్దరి మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందా? లేదంటే లవ్ ట్రాక్ మొదలైందా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.