
Sneha And Anil Ravipudi As Judges And sreemukhi As Host in Mister And Misses
Sreemukhi : బుల్లితెరపై రోజుకో కొత్త షో పుట్టుకొస్తోంది. బుల్లితెరకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. జనాలు కూడా ఇంట్లోంచి బయటకు వెళ్లి వినోదం కోరుకోవడం లేదు. ఇంట్లోనే తాపీగా కూర్చుని ఎంజాయ్ చేయడానికి అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో బుల్లితెర షోలు బాగా క్లిక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే యాంకర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంట్లో భాగంగానే శ్రీముఖి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రతీ చానెల్లో ప్రతీ షోలో శ్రీముఖి కనిపిస్తోంది. ఈటీవీలో ఆల్రెడీ జాతి రత్నాలు అనే షోను చేస్తోంది. ఇక అది ప్రతీ రోజూ వస్తుంది.
ఇక ఇప్పుడు వారానికి ఒక రోజు ప్రత్యేకంగా వస్తోంది. మంగళవారం నాడు ఈ కొత్త షో రాబోతోందట. మిస్టర్ అండ్ మిసెస్ అంటూ రాబోతోన్న ఈ షోలో శ్రీముఖి యాంకరింగ్ చేస్తోంది. అయితే ఈ షోకు ఇద్దరు స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు. నాటి అందాల హీరోయిన్ స్నేహా తెలుగు బుల్లితెరకు రాబోతోంది. ఓ తెలుగు ఎంటర్టైన్మెంట్ షోకు జడ్జ్‌గా ఉండటం ఇదే మొదటి సారి. ఇక ఆమెతో పాటు అనిల్ రావిపూడి కూడా జడ్జ్‌గా ఉండబోతోన్నాడు. ఈటీవిలో అక్టోబర్ 11న ప్రారంభం అవుతుంది మిస్టర్ అండ్ మిసెస్ ఒకరికి ఒకరు.
Sneha And Anil Ravipudi As Judges And sreemukhi As Host in Mister And Misses
ప్రతి మంగళవారం రాత్రి 9–30నిమిషాలకు ప్రసారం కానున్న ఈ షోద్వారా ప్రముఖ నటి స్నేహ తొలిసారి జడ్జిగా వ్యవహరిస్తుండటం విశేషం. స్నేహతో పాటు నటుడు శివబాలాజి ఒక జడ్జిగా వ్యవహరిస్తుండగా బ్లాక్‌బస్టర్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ స్లోగన్‌ను తెలుగువారికి పరిచయం చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి స్పెషల్ జడ్డిగా వ్యవహరించటం ఈ షోకే హైలెట్. ఈ షోలో పాల్గొంటున్న పది జంటలకు రకారకాల టాస్క్‌లు ఉంటాయి. ఆ టాస్క్‌ల్లో విజేతగా నిలిచిన వారు ఫైనల్‌కి వెళ్లి గ్రాండ్ ఫినాలే టైటిల్‌తో పాటు భారీ ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంటారు అని చెప్పుకొచ్చారు.
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
This website uses cookies.