Sobhita Dhulipala : శోభిత తెలివితేటలకి హ్యాట్సాఫ్.. సమంత చేసిన ఆ తప్పు చేయనుంటుదిగా..!
Sobhita Dhulipala : టాలీవుడ్‌లో గత కొద్ది రోజులుగా శోభిత- నాగ చైతన్య డేటింగ్ వ్యవహారం ఎంత చర్చనీయాంశంగా మారిందో మనం చూశాం. వారిద్దరు కలిసి ఉంటున్నారని, పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని జోరుగా ప్రచారం సాగింది. అయితే దీనిపై ఆగస్ట్ 8న పూర్తి క్లారిటీ వచ్చింది. చైతూ- శోభితలు ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం,ఆ ఫోటోలు బయటకు రావడం చకచకా జరిగిపోయింది. దీంతో సినీ ప్రముఖులు, అక్కినేని అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ […]
ప్రధానాంశాలు:
శోభిత తెలివితేటలకి హ్యాట్సాఫ్.. సమంత చేసిన ఆ తప్పు చేయనుంటుదిగా..!
Sobhita Dhulipala : టాలీవుడ్‌లో గత కొద్ది రోజులుగా శోభిత- నాగ చైతన్య డేటింగ్ వ్యవహారం ఎంత చర్చనీయాంశంగా మారిందో మనం చూశాం. వారిద్దరు కలిసి ఉంటున్నారని, పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని జోరుగా ప్రచారం సాగింది. అయితే దీనిపై ఆగస్ట్ 8న పూర్తి క్లారిటీ వచ్చింది. చైతూ- శోభితలు ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం,ఆ ఫోటోలు బయటకు రావడం చకచకా జరిగిపోయింది. దీంతో సినీ ప్రముఖులు, అక్కినేని అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ సంబరాలకు అంతు లేకుండా పోయింది. సమంతతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్న చైతన్య మరో పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని వారు కోరుకున్నారు.
Sobhita Dhulipala శోభిత తెలివి అద్భుతం..
వారి ఆశలు ఫలించి నాగచైతన్య తన పార్ట్‌నర్‌ను తొందరగానే వెతుక్కున్నాడు. శోభిత ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా బాగానే ఉండటంతో అక్కినేని ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా శోభిత గురించి బాలీవుడ్ లో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. శోభితకి బాలీవుడ్ లో ఐటెం సాంగ్ చేసే ఆఫర్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ డాన్ 3 చిత్రంలో నటిస్తున్నాడు. డాన్ 3 చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రంలో ఒక గ్లామరస్ ఐటెం సాంగ్ ని ఫ్లాన్ చేశారట. ఈ సాంగ్ కి శోభిత అయితే బావుంటుందని ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. శోభిత తో ఫర్హాన్ పలుమార్లు భేటీ అయ్యారట. ఐటెం సాంగ్ గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
శోభిత ఐటెం సాంగ్ చేసేందుకు నో చెప్పిందట. ఒక వేళ ఐటెం సాంగ్ చేస్తే అక్కినేని ఫ్యాన్స్, అక్కినేని ఫ్యామిలీ తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తారని తెలిసి నో అనేసిందట. మంచి పాత్రలు వస్తే చేస్తాను తప్ప ఇలాంటివి చేయనని ఖరాఖండీగా చెప్పిందట శోభిత. పెద్ద కుటుంబానికి కోడలుగా వెళుతున్నప్పుడు కెరియర్ కంటే తమ దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని భావించిన ఈ అమ్మడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుందని అంటున్నారు.