
Naga Chaitanya : గర్ల్ ఫ్రెండ్‌తో దూరంగా వెళ్లిన నాగ చైతన్య.. అనుమానాలు రేకెత్తిస్తున్న పోస్ట్..!
Naga Chaitanya : నాగ చైతన్య పర్సనల్ లైఫ్ డిస్ట్రబ్డ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత అతనికి విడాకులు ఇవ్వడం చాలా కుంగదీసింది. దాదాపు నాలుగేళ్లు కలిసి ఉన్న ఈ జంట 2021లో విడాకులు తీసుకున్నారు. అసలు వారు విడిపోవడానికి కారణం ఏంటన్నది ఇప్పటి వరకు తెలియడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం వారి విడాకులకి సంబంధించి అనేక వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇక నాగ చైతన్య .. సమంత నుండి విడిపోయాక తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్లతో సన్నిహితంగా ఉంటున్నాడంటూ పలుమార్లు కథనాలు వెలువడ్డాయి.
శోభిత ధూళిపాళ్లను అప్పుడప్పుడు కలుస్తూ ఉన్న నాగ చైతన్య తాను కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి కూడా ఓ సారి తీసుకెళ్లాడనే టాక్ ఉంది. ఇక లండన్ వెళ్లిన సమయంలో నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ్ల కనిపించింది. అక్కడి ఇండియన్ రెస్టారెంట్ కి వీరు వెళ్లగా, చెఫ్ నాగ చైతన్యతో సెల్ఫీ దిగాడు.. ఆ సమయంలో వెనక శోభిత కనిపించింది. ఇలా పలు సందర్భాలలో వీరిద్దరి గురించి ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది. తాజాగా నాగ చైతన్య విహార యాత్రకి వెళ్లినట్టు తెలుస్తుంది. ఏకాంతంగా సాయంత్రపు సూర్యకిరణాలు ఆస్వాదిస్తూ ఒక ఫొటో దిగాడు చైతూ. దానికి శోభిత ధూళిపాళ్ల స్పందించింది. ఒక లైక్ కొట్టింది.
Naga Chaitanya : గర్ల్ ఫ్రెండ్‌తో దూరంగా వెళ్లిన నాగ చైతన్య.. అనుమానాలు రేకెత్తిస్తున్న పోస్ట్..!
ఇంకేముంది వారిద్దరి గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చెప్పుకొస్తున్నారు. ఇద్దరూ కలిసి ఏకాంతంగా ఎక్కడికో చెక్కేశారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. చైతూ పక్కనే ఆమె ఉండి ఉంటుంది, త్వరలోనే వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే వాటిని చైతూ, శోభిత ఖండిస్తూనే ఉన్నారు. ఇక ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక శోభిత నటించిన హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్ ఇటీవల అమెరికాలో విడుదల అయ్యింది. త్వరలో ఇండియాలో కూడా విడుదల చేసే ఆలోచన చేస్తున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.