Kavitha : సోషల్ మీడియా హవా పెరిగిన తర్వాత సెలబ్రిటీలపై ఎలాంటి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. బ్రతికున్న వాళ్లని చాలా మందే చంపేశారు. వారు తిరిగి మీడియా ముందుకి వచ్చి అసలు విషయం చెబితే గాని పుకార్లకి బ్రేక్ పడేది కాదు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి కవితపై కూడా ఇలాంటి పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత రెండు, మూడు రోజులుగా నటి కవిత చనిపోయారంటూ నెట్టింట ఫేక్ న్యూస్‌లు సర్క్యులేట్ అవుతున్న సంగతి తెలిసిందే.
దీంతో కవిత ఈ వార్తలపై స్పందిస్తూ యూట్యూబ్ చానెళ్లకు వార్నింగ్ ఇచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, చట్టరీత్యా చర్యలు తీసుకునేలా చేస్తానని చెప్పారు.తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ప్రస్తుతం చెన్నైలో జీ టీవీ సీరియల్ షూటింగులో పాల్గొంటున్నానని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఫేక్ న్యూస్‌లు నమ్మకూడదని ఆమె చెప్పారు. తాను చనిపోయానంటూ యూట్యూబ్ లో కొందరు వీడియోలు పెడుతున్నారని, అవి చూసి తన స్నేహితులు, బంధువులు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆమె అన్నారు. వెంటనే ఆ వీడియోలు డిలీట్ చేయకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు.
ఎన్నో సినిమాల్లో నటించి దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి కవిత కుటుంబాన్ని కరోనా వణికించిన విషయం తెలిసిందే. కరోనాకి ఆమె కుమారుడు సంజయ్ రూప్ , భర్త దశరథ కన్నుమూసిన విషయం తెలిసిందే.తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకుంది కవిత. 11 ఏళ్ల వయసులో వెండితెరపై అడుగుపెట్టిన ఆమె.. కె. విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరి సిరి సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడి కొన్ని వందల సినిమాల్లో నటించింది.బాలనటిగా వెండితెరకు పరిచయమైన కవిత 350కి పైగా సినిమాల్లో నటించారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.