Chiranjeevi – Indira Devi : ఇందిరా దేవి గారు చనిపోయిన సమయంలో ఇలాంటి ట్వీట్‌ ఏంటి మెగాస్టార్‌ గారు?

Authored By aruna | The Telugu News | Updated on: September 28, 2022, 4:30 pm

Chiranjeevi – Indira Devi : నేడు తెల్లవారు జామున సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి గారు మృతి చెందిన విషయం అందరికీ తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ఆమె మరణం కృష్ణ, మహేష్ బాబు కుటుంబ సభ్యులను కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది. కేవలం కృష్ణ, మహేష్ బాబు కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా టాలీవుడ్ మొత్తం కూడా నేడు సంతాప దినంగా భావిస్తుంది. చాలా మంది ఫిలిం మేకర్స్ అనధికారికంగా సంతాప దినంగా భావించి సినిమా యొక్క షూటింగ్ లను ఆపివేశారు. కానీ మెగాస్టార్ చిరంజీవి నేడు గాడ్ ఫాదర్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని అనంతపురంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. సరే ముందుగా ప్లాన్ చేసిన కార్యక్రమం కనుక ఆపివేస్తే భారీ ఆర్థిక నష్టం వస్తుంది కనుక నిర్వహించుకోవడంలో తప్పులేదు.

కానీ చిరంజీవి నేడు చేసిన ట్వీట్ విమర్శలకు తెర లేపింది. నేటితో రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 15 సంవత్సరాలు పూర్తి అయింది. అంటే చిరుత సినిమా విడుదల అయ్యి 15 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు యొక్క విజయాన్ని పురస్కరించుకొని సంతోషంగా ఒక ట్వీట్‌ చేశారు. ఇందిరా దేవి మృతి చెందిన కొన్ని గంటల్లోనే చిరంజీవి వంటి పెద్ద వ్యక్తి నుండి ఇలాంటి ట్వీట్ రావడం చాలా మందికి అసంతృప్తిగా ఉంది. ఒక వైపు కృష్ణ, మహేష్ బాబు ఫ్యామిలీ దుఃఖంలో ఉండగా మీరు 15 ఏళ్ల సంబరం అంటూ ఫోటోలను షేర్‌ చేసి ఇలా సెలబ్రేషన్లు చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అంటూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా చాలామంది ప్రశ్నిస్తున్నారు.

social media trolls on Chiranjeevi about Indira Devi death

social media trolls on Chiranjeevi about Indira Devi death

అయితే ఈ విషయంలో మెగాస్టార్ కి మద్దతుగా నిలిచే వారు కూడా ఉన్నారు. చిరంజీవి గారు ఉదయాన్నే ఇందిరా దేవి గారి మరణానికి సంతాపం తెలియజేశారు. అంతకు మించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తర్వాతనే చిరంజీవి గారు ఆ ట్వీట్‌ చేశారు. అంత్యక్రియలు అన్ని పూర్తి అయిన తర్వాత చిరంజీవి చేసిన ట్వీట్ ని కొందరు కావాలని వివాదాస్పదం చేస్తున్నారంటూ మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కొందరు మహేష్ బాబు అభిమానులమంటూ చిరంజీవిని విమర్శించడం అస్సలు కరెక్ట్ కాదని, ఇలాంటి విషయాలను పెద్దవిగా చేసి చూడడంతో ఇండస్ట్రీలో మంచి వాతావరణం మిస్ అవుతామంటూ.. మెగా అభిమానులు ఆ విమర్శలు చేసే వాళ్లకు ఇకనైనా ఆపండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు..

aruna

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp