Hyper Aadi : కామెడీ పేరుతో మరింతగా రెచ్చి పోతున్న హైపర్ ఆది… ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: February 23, 2023, 3:40 pm

Hyper Aadi : జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది ఈ మధ్య కాలంలో సినిమాలతో కూడా బిజీ అయిన విషయం తెలిసిందే. జబర్దస్త్ కార్యక్రమానికి దూరం అయిన హైపర్ ఆది కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రమే కొనసాగుతున్నాడు. అక్కడ వరుసగా ఎపిసోడ్స్ లో సందడి చేస్తున్న హైపర్ ఆది భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు కూడా వస్తున్నాయి. కామెడీ పేరుతో కాస్త వల్గర్ గా హైపర్ ఆది ప్రవర్తించడం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం.

social media trolls on jabardasth Hyper Aadi comedy

social media trolls on jabardasth Hyper Aadi comedy

ఈ మధ్య కాలంలో తనకంటే చాలా పెద్ద వారైన మహిళల పట్ల ఆయన అవహేళనగా మాట్లాడుతూ చేస్తున్న వ్యాఖ్యలు వివాదానికి తెర తీస్తున్నాయి. హైపర్ ఆది చాలా కాలంగా కూడా సీనియర్ నటీమనులతో వివాదాస్పదంగా మాట్లాడడం, వారిపై పంచ్ డైలాగ్స్ వేయడం చూస్తూనే ఉన్నాం. ఈసారి కూడా సీనియర్ నటిపై హైపర్ ఆది చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారంను రేపుతున్నాయి. అంతే కాకుండా ఆయన్ను తీవ్రంగా ఇబ్బందుల్లో కి నెట్టే విధంగా వైరల్‌ అవుతున్నాయి. ఆడవారిని కనీసం గౌరవించకుండా హైపర్ ఆది చేస్తున్న కామెడీ పై రకాలుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

social media trolls on jabardasth Hyper Aadi comedy

social media trolls on jabardasth Hyper Aadi comedy

కామెడీ పేరు ఇంత రెచ్చి పోయి ఆడవారిని అవమానించడం అవసరమా అంటూ హైపర్ ఆదిని ప్రశ్నిస్తున్నారు. హైపర్ ఆది మాత్రం తనకు ఎప్పటికీ ఆడవారంటే గౌరవం అని, తాను ఎప్పుడూ కూడా వారిని చులకనగా చూడనని గతంలో చెప్పుకొచ్చాడు. హైపర్ ఆది కేవలం కామెడీగా మాత్రమే ఆడవారి పట్ల కాస్త తక్కువగా మాట్లాడుతాడు కానీ అతడికి ఉద్దేశం అది కాదని అభిమానులు మాట్లాడుతున్నారు. కానీ హైపర్‌ ఆది తన పద్దతిని మార్చుకోక పోతే మాత్రం తీవ్ర విమర్శలు ముందు ముందు ఎదుర్కొనే అవకాశం ఉంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp