Jabardasth Kevvu Karthik : ఈ కెవ్వు కార్తీక్‌ ను ఎలా జబర్దస్త్‌ లో ఉంచుతున్నారా బాబు!

 Authored By prabhas | The Telugu News | Updated on :29 June 2022,1:30 pm

Jabardasth Kevvu Karthik : జబర్దస్త్‌ లో ఉన్న కొందరు కమెడియన్స్ మినిమంగా కూడా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వలేరు. కనీసం సింగిల్ డైలాగ్ ను కూడా పర్ఫెక్ట్‌ గా చెప్పడం వారి వల్ల కాదు. అయినా కూడా వారు తాము జబర్దస్త్‌ కమెడియన్స్ అంటూ చెప్పుకుంటూ బయట సెలబ్రెటీగా చలామని అవుతున్నారు. కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా టీమ్‌ లీడర్స్ కూడా అదే పరిస్థితి. కొత్తగా ఉన్న కొందరు టీమ్‌ లీడర్స్ కు కేవలం సీనియార్టీ ని బట్టి టీమ్‌ లీడర్స్ గా పదవి ఇచ్చారు తప్ప వారికి కనీసం స్క్రిప్ట్‌ రాసుకోవడం కూడా రాదని మల్లెమాల వర్గాల వారు అంటున్నారు.

ప్రస్తుతం జబర్దస్త్‌ లో ఉన్న కెవ్వు కార్తీక్ గురించి సోషల్‌ మీడియాలో రచ్చ రంబోల ట్రోల్స్ వస్తున్నాయి. మరీ దారుణంగా కెవ్వు కార్తీక్ స్కిట్‌ లు ఉంటున్నాయని అంటున్నారు. ఎవరైనా గెస్ట్‌ లు వచ్చినప్పుడు వారిని కాకా పట్టడం.. జడ్జ్‌ లను ఆకట్టుకునేలా మాట్లాడటం మాత్రమే చేస్తూ ఉండే కెవ్వు కార్తీక్ ఈమద్య స్కిట్‌ లకు స్క్రిప్ట్‌ రాసుకోలేదేమో మరేమైందో కాని తన ఇంటి యొక్క గృహ ప్రవేశ వీడియోను ఒక ఎపిసోడ్ లో స్కిట్‌ గా వేయించాడు. దాన్ని జబర్దస్త్‌ వారు ఎలా వేశారో వాళ్లకే తెలియాలి. యూట్యూబ్‌ లో హోమ్‌ టూర్‌ అన్నట్లుగా ఉంది.

social media trolls on Jabardasth Kevvu Karthik comedy skits

social media trolls on Jabardasth Kevvu Karthik comedy skits

ఇక తాజా ఎపిసోడ్‌ లో ఒక పిక్నిక్‌ కు తన టీమ్‌ తో కెవ్వు కార్తీక్‌ వెళ్లిన వీడియోను వేయించాడు. ఈ కెవ్వు కార్తీక్ కు ఎలా టీమ్‌ లీడ్ ఇచ్చారో అర్థం కావడం లేదు అంటూ చాలా మంది చాలా రకాలుగా జుట్టు పీక్కుంటున్నారు. అసలు జబర్దస్త్‌ లో ఇలాంటి వీడియో లను ప్లే చేసి కామెడీ తెప్పించే ప్రయత్నం ఏంటో అంటూ కొందరు కోపంతో ఉన్నారు. స్క్రిప్ట్ రాయడానికి రానప్పుడు టీమ్‌ లీడ్ ను వదిలేసుకోవచ్చు కదా కెవ్వు కార్తీక్ అంటూ సోషల్‌ మీడియాలో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. వీటికి ఆయన నుండి ఎలాంటి సమాధానం వస్తుంది అనేది చూడాలి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి