Jabardasth Kevvu Karthik : కెవ్వు కార్తీక్ ఇళ్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. జబర్దస్త్ షో వేదికగా గృహ ప్రవేశం
Jabardasth Kevvu Karthik : జబర్దస్త్ స్టేజ్ మీద నుంచి ఎంతో మంది కమెడియన్లు వెలుగులోకి వచ్చారు. ఎంతో ఎత్తుకు ఎదిగారు. కొందరు వెండితెర వైపు వెళ్లారు. ఇంకొందరు బుల్లితెరపైనే ఇతర చానెళ్లలో సెట్ అయ్యారు. అయితే కొందరు మాత్రం ఇంకా జబర్దస్త్ షోలోనే కంటిన్యూ అవుతున్నారు. అలా బాగానే సంపాదిస్తోన్నారు. ఇక ఇప్పుడు కెవ్వు కార్తీక్ తన కొత్తింటిని చూపించేశాడు.
జబర్దస్త్ ఆర్టిస్టుల్లో చాలా మంది సొంతింటి కలను నెరవేర్చుకున్నారు. దాదాపు టీం లీడర్లంతా కూడా ఇళ్లను కట్టేసుకున్నారు. అంతా జబర్దస్త్ పుణ్యమే. ఇక సుధీర్ కూడా తన కొత్తింటిని కట్టేసుకున్నాడు. దీని మీద ఆ మధ్య స్కిట్ కూడా వేశాడు. అయితే ఆ ఇళ్లు ఇంకా పూర్తి కాలేనట్టుంది. అయితే ఇప్పుడు కెవ్వు కార్తీక్ మాత్రం తన గృహ ప్రవేశ వేడుకను ఎక్స్ ట్రా జబర్దస్త్ వేదికగానే ప్రకటించాడు.

Kevvu Karthik House Warming In Extra Jabardasth
Jabardasth Kevvu Karthik : ఇంటిని చూపించిన కెవ్వు కార్తీక్..
తన గృహ ప్రవేశాన్ని షోలో స్కిట్‌గా వేసినట్టున్నాడు. ఈ ఈవెంట్‌కు అందరూ వెళ్లినట్టు కనిపిస్తోంది. అపార్మెంట్‌ను, ఆ ఇంటిని కూడా చూపించారు. అయితే పూర్తి ఎపిసోడ్‌లో ఇళ్లును ఇంకాస్త డీటైల్డ్‌గా చూపిస్తాడేమో. మొత్తానికి జబర్దస్త్ షోతో అందరూ బాగానే సంపాదించేస్తున్నారు. అయితే చిన్న చిన్న ఆర్టిస్టులు, కమెడియన్ల పరిస్థితి మాత్రం మారడం లేదు.
