Prabhas : హలో ప్రభాస్‌ ‘కార్తికేయ 2’ చూశావా.. సోషల్‌ మీడియాలో వింత ట్రోల్స్‌

Authored By aruna | The Telugu News | Published on: August 24, 2022, 5:40 pm

Prabhas : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ను మరియు ఆయన నటించిన రాధేశ్యామ్‌ సినిమాను నెటిజన్స్ కొందరు వదిలి పెట్టడం లేదు. మరీ దారుణంగా ట్రోల్స్ చేయడంతో పాటు సందర్భం వచ్చిన ప్రతిసారి గుర్తు చేసుకుని మరీ రాధేశ్యామ్‌ ను ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ప్రభాస్ కు కథ ఎంపిక రాదంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు సినిమాల మేకింగ్‌ పై ప్రభాస్‌ కి ఇంకా పట్టు వచ్చినట్లుగా లేదు అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఏదో ఒక విషయంలో రాధేశ్యామ్‌ సినిమాను సోషల్‌ మీడియా ద్వారా విమర్శిస్తూ కొందరు ప్రభాస్ ను టార్గెట్‌ చేస్తూ ఉన్నారంటూ తాజా పరిణామాలు చూస్తూ ఉంటే అర్థం అవుతోంది.

ప్రభాస్ హీరోగా వచ్చిన రాధేశ్యామ్‌ సినిమా ఫలితం ఏంటో అందరికి తెల్సిందే. దాదాపుగా మూడు వందల కోట్ల బడ్జెట్‌ తో వచ్చిన రాధేశ్యామ్‌ సినిమా ఉత్తర భారతంలో కేవలం 18 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. వంద కోట్లు ఈజీగా అక్కడ రాబడుతుందని భావించినా కూడా అక్కడ కనీసం పాతిక కోట్లకు కూడా దిక్కులేదు. కానీ కేవలం పాతిక కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన కార్తికేయ 2 సినిమా ను ఇప్పుడు బాలీవుడ్‌ ప్రేక్షకులు తెగ ఆధరిస్తున్నారు. అక్కడ సినిమా భారీ ఎత్తున వసూళ్లు నమోదు చేస్తోంది. ఇప్పటికే సినిమా 16 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లుగా తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో రాధేశ్యామ్‌ సినిమా ను క్రాస్ చేయడం ఖాయంగా చర్చ జరుగుతోంది.

social media trolls on prabhas and radhesyam movie compare with Karthikeya 2 movie

social media trolls on prabhas and radhesyam movie compare with Karthikeya 2 movie

లాంగ్ రన్ లో కార్తికేయ 2 సినిమా పాతిక కోట్లకు మించి వసూళ్లు నమోదు చేసినా ఆశ్చర్యం లేదు. ఈ వీకెండ్‌ కి కార్తికేయ 2 సినిమా సాధించబోతున్న వసూళ్ల విషయంలో అంతా కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈ సమయంలో కార్తికేయ 2 సినిమా ను చూశావా ప్రభాస్‌ అంటూ కొందరు సోషల్‌ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. రాధేశ్యామ్‌ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కు కూడా కార్తికేయ 2 సినిమాని చూపించాల్సిన అవసరం ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ లో అద్భుతాలను ఎలా ఆవిష్కరించాలో చందు మొండేటి వద్ద తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాధాకృష్ణకు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ వారు చేతిలో డబ్బు ఉందని సబ్జెక్ట్ లేకుండానే వందల కోట్లు పెట్టవద్దని కార్తికేయ 2 సినిమాను చూసి అయినా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp