Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను మరియు ఆయన నటించిన రాధేశ్యామ్ సినిమాను నెటిజన్స్ కొందరు వదిలి పెట్టడం లేదు. మరీ దారుణంగా ట్రోల్స్ చేయడంతో పాటు సందర్భం వచ్చిన ప్రతిసారి గుర్తు చేసుకుని మరీ రాధేశ్యామ్ ను ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ప్రభాస్ కు కథ ఎంపిక రాదంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు సినిమాల మేకింగ్ పై ప్రభాస్ కి ఇంకా పట్టు వచ్చినట్లుగా లేదు అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఏదో ఒక విషయంలో రాధేశ్యామ్ సినిమాను సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తూ కొందరు ప్రభాస్ ను టార్గెట్ చేస్తూ ఉన్నారంటూ తాజా పరిణామాలు చూస్తూ ఉంటే అర్థం అవుతోంది.
ప్రభాస్ హీరోగా వచ్చిన రాధేశ్యామ్ సినిమా ఫలితం ఏంటో అందరికి తెల్సిందే. దాదాపుగా మూడు వందల కోట్ల బడ్జెట్ తో వచ్చిన రాధేశ్యామ్ సినిమా ఉత్తర భారతంలో కేవలం 18 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. వంద కోట్లు ఈజీగా అక్కడ రాబడుతుందని భావించినా కూడా అక్కడ కనీసం పాతిక కోట్లకు కూడా దిక్కులేదు. కానీ కేవలం పాతిక కోట్ల బడ్జెట్ తో రూపొందిన కార్తికేయ 2 సినిమా ను ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులు తెగ ఆధరిస్తున్నారు. అక్కడ సినిమా భారీ ఎత్తున వసూళ్లు నమోదు చేస్తోంది. ఇప్పటికే సినిమా 16 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లుగా తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో రాధేశ్యామ్ సినిమా ను క్రాస్ చేయడం ఖాయంగా చర్చ జరుగుతోంది.
లాంగ్ రన్ లో కార్తికేయ 2 సినిమా పాతిక కోట్లకు మించి వసూళ్లు నమోదు చేసినా ఆశ్చర్యం లేదు. ఈ వీకెండ్ కి కార్తికేయ 2 సినిమా సాధించబోతున్న వసూళ్ల విషయంలో అంతా కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈ సమయంలో కార్తికేయ 2 సినిమా ను చూశావా ప్రభాస్ అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. రాధేశ్యామ్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కు కూడా కార్తికేయ 2 సినిమాని చూపించాల్సిన అవసరం ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ లో అద్భుతాలను ఎలా ఆవిష్కరించాలో చందు మొండేటి వద్ద తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాధాకృష్ణకు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ వారు చేతిలో డబ్బు ఉందని సబ్జెక్ట్ లేకుండానే వందల కోట్లు పెట్టవద్దని కార్తికేయ 2 సినిమాను చూసి అయినా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.