Sohel : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సోహెల్ పలు సినిమాలలో నటించారు. కానీ ఆయనకు బిగ్ బాస్ షో ద్వారానే మంచి క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ తోనే సినిమాలలో హీరోగా నటించడం మొదలుపెట్టారు. తాజాగా ఆయన ‘ బూట్ కట్ బాలరాజు ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ సినిమా విడుదలైనట్లు కూడా ఎవరికీ తెలియదు. అలాగే ఈ సినిమా భారీ డిజాస్టర్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే తాజాగా బూట్ కట్ బాలరాజు సినిమా గురించి చెబుతూ సోహెల్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో విషయంలో కొంతమంది సోహెల్ ను సపోర్ట్ చేస్తే మరికొందమంది మాత్రం సోహెల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పే విధానంలో తప్పు ఉండవచ్చు కానీ నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కదేమో అనే భయంతో నేను ఆ కామెంట్లు చేశానని సోహెల్ తెలిపారు. నేను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉందని ఆయన కామెంట్ చేశారు. థియేటర్లలో సినిమా చూసి అభిప్రాయాన్ని పంచుకుంటే బాగుంటుందని సోహెల్ వెల్లడించారు. అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమా తర్వాత బూట్ బాలరాజు కట్ బాలరాజు సినిమాకి ప్రాధాన్యత ఉందని ఆయన అన్నారు. ప్రొఫెషనల్ రివ్యూ రైటర్లను నేను కామెంట్ చేయను అని సోహెల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ప్రాజెక్ట్స్ అనేవి పోవని సోహెల్ కామెంట్ చేశారు. నాకు తెలియకుండానే కొన్నిసార్లు నా బిహేవియర్ వల్ల నష్టపోతున్నానని వెల్లడించారు. సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా అని పూలచొక్కా నవీన్ ఈ సినిమాలో తెలంగాణ భాషను క్రింజ్ చేశారని కామెంట్ చేశాడని సోహెల్ చెప్పుకొచ్చారు.
తెలంగాణలో హైదరాబాద్ తెలంగాణ వేరని గోదావరిఖని తెలంగాణ వేరు అని ఆయన తెలిపారు. ఈ విషయం పూలచొక్కా నవీన్ కు తెలియదని సోహెల్ కామెంట్ చేశారు. టమాటాలు ఇస్తాను అని చెబుతాడని, టమాటాలు అమ్ముకునే ముఖం అంటూ నవీన్ పై సోహెల్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. 0.45 రేటింగ్ అంటూ నవీన్ సినిమాను తీసి పడేసాడంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచికి మంచి చెడుకు చెడుల ఉండాలని లేకపోతే తొక్కేస్తారని సోహెల్ అన్నారు. తప్పు చేసిన వాళ్ళను మాత్రమే నేను ప్రస్తావిస్తానని తెలిపారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.