Home » Entertainment » Sonu Sood About On Call Me Old Number
Entertainment

Sonu Sood : కరోనా విజృంభన.. పాత నంబర్ కి ఫోన్ చేయండి.. సోను సూద్ కీలక ప్రకటన..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: December 24, 2022, 9:20 pm
Advertisement

Sonu Sood: ప్రపంచంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే చైనాలో మూడు కోట్లకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. చైనా ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. దీంతో చైనా హాస్పిటల్స్ మొత్తం కరోనా రోగులతో నిండిపోయాయి. ఇటువంటి పరిస్థితులలో భారత్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. విదేశీ ప్రయాణికులకు సంబంధించి ప్రతిచోట కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. చైనా, హాంకాంగ్ ఇంకా కొరియా దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీఎస్ఆర్ టెస్ట్ చేస్తున్నారు.

Advertisement

“BF 7” అనే కొత్త వేరియంట్.. వేగంగా విస్తరిస్తూ ఉంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ కరోనా కట్టడికి సంబంధించి ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో కరోనా వచ్చిన ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వాలు చేయని చాలా పనులు నటుడు సోను సూద్ చేయడం జరిగింది. 2020లో లాక్ డౌన్ సమయంలో… వలసదారులకు ప్రత్యేకమైన బస్సులు వాహనాలు ట్రైన్లు ఇంకా విమానాలు కూడా ఏర్పాటు చేసి గమ్యస్థానాలకు చేర్చాడు.

Sonu Sood About on Call Me old number

Advertisement

దేశంలో ఏ మూలలో అయినా ఆక్సిజన్ లేక బాధపడుతున్న వాళ్లకు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్ లు కూడా పంపిణీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ కేసులు పెరుగుతూ ఉండటంతో సోనూసూద్ ఓ ప్రకటనతో అందరికీ భరోసా ఇచ్చాడు. తన పాత నెంబర్ పనిచేస్తూనే ఉందని… కోవిడ్ సాయం కోసం తనని సంప్రదించవచ్చు అని అన్నారు. సాయం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. సోను సూద్ కామెంట్ పై చాలామంది నేటిజన్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపద్బాంధవుడు మళ్ళీ రీఎంట్రీ అని కొనియాడుతున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి