Soundarya : ఆ రోజుల్లో పెళ్లి చేసుకోలేదు అని సౌందర్య ని ఎంత దారుణంగా టార్చర్ చేసారో తెలుసా ?

 Authored By prabhas | The Telugu News | Updated on :2 March 2023,10:20 am

Soundarya : కన్నడ బ్యూటీ సౌందర్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఈమెకు ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆమె పేరుకు తగ్గట్టే ఎంతో అందంగా ఉంటారు. తన నటనతో, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన సౌందర్య ఇప్పుడు మన మధ్య లేరు. ఒకప్పటి స్టార్ హీరోలు అందరితో నటించిన సౌందర్య ఇప్పటికీ అభిమానుల మదిలో నిలిచి ఉన్నారు. అప్పట్లో స్టార్ హీరోలు అందరూ తమ సినిమాలో సౌందర్య ఉండాలని పట్టుబట్టేవారు. ఇటు దర్శకులు, నిర్మాతలు కూడా తమ సినిమాల్లో కచ్చితంగా సౌందర్య ఉండేలా చూసుకునేవారట.

Soundarya married with her brother in law

Soundarya married with her brother in law

దీంతో సౌందర్య క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతుంది. అయితే సౌందర్య గురించి ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఆమని తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆమె జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదిరించి ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకుందని చెప్పింది. ఆమె కష్టపడినన్ని రోజులు సుఖం లేకుండా పోయింది. ఆమె ఎంత సంపాదించిన దానిని అనుభవించే టైం ఆమెకు లేదని చెప్పారు. అయితే చివరకు తన సొంత బావను పెళ్లి చేసుకొని ఆనందంగా లైఫ్ లో ఎంజాయ్ చేయాలనుకున్న టైం కి ఆమె మనలను విడిచి దూరంగా వెళ్లిపోయిందని ఆమె అన్నారు.

హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు సౌందర్య గర్భవతిగా కూడా ఉన్నారు. ఇది అత్యంత బాధాకర విషయం. సౌందర్య జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. చివరికి తన జీవితం లో ఆనందం గడియలు వచ్చేసరికి దేవుడు ఆమెను తీసుకెళ్లిపోయాడు. ఏది ఏమైనా ఇండస్ట్రీలో మహానటి సావిత్రి తర్వాత సౌందర్యకు ఆ క్రేజ్ లో స్థాయి ఉంది. టాలీవుడ్ లో వెంకటేష్, చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, శ్రీకాంత్ ఇలా అప్పటి హీరోలు అందరితో నటించినా సౌందర్య ఇప్పుడు బ్రతికి ఉంటే ఎన్నో సినిమాలలో నటించేవారు కదా అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి