Sreeja : త‌న భ‌ర్త పేరుని సోష‌ల్ మీడియా నుండి తొల‌గించిన చిరంజీవి కూతురు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :18 January 2022,1:30 pm

Sreeja : సినీ ప్ర‌ముఖుల బ్రేక‌ప్‌లు అభిమానుల‌కి ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఇప్ప‌టికే నాగ చైత‌న్య, అమీర్ ఖాన్, ధ‌నుష్ త‌మ వైవాహిక జీవితానికి స్వ‌స్థి ప‌ల‌క‌గా, త్వ‌ర‌లో మ‌రో బ్రేక‌ప్ జ‌ర‌గ‌నుంద‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. గ‌త కొద్ది రోజులుగా చిరంజీవి చిన్న అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ ఆ ఫ్యామిలీ వేడుక‌లకి దూరంగా ఉంటున్నాడు. ఆయ‌న న‌టించిన సూప‌ర్ మ‌చ్చి సినిమాని మెగా ఫ్యామిలీ ఎవ‌రు కూడా స‌పోర్ట్ చేయ‌లేదు. దీంతో శ్రీజ‌- క‌ళ్యాణ్ దేవ్ రిలేష‌న్ షిప్‌కి ఏమైన చెడిందా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్న క్ర‌మంలో శ్రీజ త‌న భ‌ర్త పేరుని సోష‌ల్ మీడియా అకౌంట్ నుండి తొల‌గించింది.

నిజానికి క‌ళ్యాణ్ దేవ్‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత శ్రీజ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఐడీని శ్రీజా క‌ళ్యాణ్‌గా మార్చుకున్నారు. కాని సడెన్‌గా ఈ అమ్మ‌డు త‌న పేరుని శ్రీజ కొణిదెల‌గా మార్చింది. దీంతో అంద‌రి అనుమాల‌ని రెట్టింపు చేసింది. కొన్ని నెల‌లుగా ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు నెల‌కొన్నాయ‌ని, గత ఏడాది జూలై, ఆగస్టులోనే వారు విడిపోయారని సమాచారం. విడిపోయిన తర్వాత ఇద్దరూ దూర దూరంగా ఉంటూ కాస్త ప్రైవసీ మెయిన్ టెయిన్ చేస్తూ వ‌చ్చారట‌. కళ్యాణ్‌ దేవ్‌కి తనకు మధ్య ఏం జరిగిందనేది ఆరా తీసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో అనేక రూమర్స్ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.

sreeja removes her husband name 

sreeja removes her husband name

Sreeja : మ‌రో జంట బ్రేక‌ప్ చెప్ప‌నుందా?

శ్రీజ, కళ్యాణ్‌ దేవ్‌ మధ్య రిలేషన్‌ చెడిందా ? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. 2007లో శిరీష్ భ‌ర‌ద్వాజ్‌ను ఆర్య స‌మాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు శ్రీజ. అప్ప‌ట్లో ఈమె పెళ్లి ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వీరికి ఒక పాప పుట్టింది. పెళ్లైన కొన్నేళ్ల‌కు అంటే 2014లో విడాకులు తీసుకోవ‌డం ద్వారా శ్రీజ, శిరీష్ భ‌రద్వాజ్ విడిపోయారు. త‌ర్వాత 2016లో క‌ళ్యాణ్ దేవ్‌, శ్రీజ వివాహం జ‌రిగింది. వీరికి ఓ పాప పుట్టింది. శ్రీజను పెళ్లి చేసుకున్న తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి