Sreeleela In Pushpa 2 : పుష్ప2లో శ్రీలీల ఐటెమ్ సాంగ్.. ఊఊ అనడమే లేదు.. ఊ అనడమే.. అభిమానులకు పండగే ఇక | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sreeleela In Pushpa 2 : పుష్ప2లో శ్రీలీల ఐటెమ్ సాంగ్.. ఊఊ అనడమే లేదు.. ఊ అనడమే.. అభిమానులకు పండగే ఇక

Sreeleela In Pushpa 2 : ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా అంటూ పుష్ప పార్ట్ వన్ సినిమా సమంత చిందులేసిన విషయం తెలుసు కదా. నిజానికి ఆ పాట ఆ సినిమాకు చాలా ప్లస్ అయింది. మరి.. సెకండ్ పార్ట్ లోనూ ఆమాత్రం ఊపు ఉండే పాట ఉండాలి కదా. అందుకే డైరెక్టర్ సుకుమార్.. ఒక పవర్ ఫుల్ సాంగ్ ను పుష్ప 2 లో పెట్టబోతున్నారు. ఆ పాటలో ఆడిపాడేది ఎవరో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :30 July 2023,2:00 pm

Sreeleela In Pushpa 2 : ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా అంటూ పుష్ప పార్ట్ వన్ సినిమా సమంత చిందులేసిన విషయం తెలుసు కదా. నిజానికి ఆ పాట ఆ సినిమాకు చాలా ప్లస్ అయింది. మరి.. సెకండ్ పార్ట్ లోనూ ఆమాత్రం ఊపు ఉండే పాట ఉండాలి కదా. అందుకే డైరెక్టర్ సుకుమార్.. ఒక పవర్ ఫుల్ సాంగ్ ను పుష్ప 2 లో పెట్టబోతున్నారు. ఆ పాటలో ఆడిపాడేది ఎవరో కాదు.. ట్రెండింగ్ హీరోయిన్ శ్రీలీల. ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. అందుకే శ్రీలీలను సుకుమార్ సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

పుష్ప 2 కోసం కావాలని పట్టుబట్టి శ్రీలీలను సుకుమార్ తీసుకున్నారట. స్పెషల్ సాంగ్ మామూలుగా ఉండదట. పుష్పలోని ఊ అంటావా పాట ఎంత ఫేమస్ అయిందో అంతకు మించి ఈ పాట ఫేమస్ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ పాటలో మాస్ స్టెప్పులు ఉండబోతున్నాయట. అసలే అల్లు అర్జున్.. మరోవైపు ట్రెండింగ్ హీరోయిన్ శ్రీలీల. ఇద్దరి కాంబోలో పాట అంటే అదిరిపోవాల్సిందే కదా.ఒకవేళ శ్రీలీలకు ఈ పాట మంచి బ్రేక్ ఇస్తే టాలీవుడ్, బాలీవుడ్ లో శ్రీలీలకు సినిమా అవకాశాలు పెరుగుతాయి. అందుకే శ్రీలీల ఈ స్పెషల్ సాంగ్ మీద చాలా హోప్స్ పెట్టుకుంది.

Sreeleela In Pushpa 2

Sreeleela In Pushpa 2

Sreeleela In Pushpa 2 : శ్రీలీలకు ఈ పాట హిట్ ఇస్తే టాలీవుడ్ లో బ్రేక్ వచ్చినట్టేనా?

నిజానికి పుష్ప 2 సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో బాలీవుడ్ లోనూ శ్రీలీల ఈ పాటతో పరిచయం కాబోతోంది. బాలీవుడ్ జనాలు శ్రీలీలను ఆ పాటలో ఆదరిస్తే ఇక తనకు బాలీవుడ్ లోనూ తిరుగు ఉండదు. చూడాలి మరి ఈ పాట తనకు ఎంత బ్రేక్ ఇస్తుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది