Sreeleela : అడ్డంగా దొరికిన శ్రీలీల.. వైరల్ అవుతున్న వీడియో
ప్రధానాంశాలు:
Sreeleela : అడ్డంగా దొరికిన శ్రీలీల.. వైరల్ అవుతున్న వీడియో
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో కిస్సిక్ సాంగ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ. కాగా ప్రస్తుతం హిందీలో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. మూవీ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమాయణం మొదలైందని వార్తలు బయటకు వచ్చాయి.

Sreeleela : అడ్డంగా దొరికిన శ్రీలీల.. వైరల్ అవుతున్న వీడియో
Sreeleela బుక్ అయింది..
ఈ వార్తలకు మరింత ఆజ్యంపోసేలా కార్తీక్ ఆర్యన్ తల్లి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి డాక్టర్ అయి ఉండాలి అన్నారు. ఆ మాటలు శ్రీలీలను ఉద్దేశించే అన్నారని ఓపెన్ గానే డిస్కషన్ నడిచింది. ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే ఎంబీబీఎస్ చదువుతోంది శ్రీలీల. దీంతో వీరిద్దరి రిలేషన్ కన్ఫర్మ్ అంటూ అందరూ భావించారు.
ఇక ఇప్పుడు మరోసారి కార్తీక్ ఆర్యన్ తో కలిసి రెస్టారెంట్ కి వెళ్లి అడ్డంగా బుక్ అయ్యింది శ్రీలీల. దీంతో మళ్లీ వీరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ముంబైలోని బాంద్రా రెస్టారెంట్ నుంచి శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ బయటకు వస్తున్న వీడియో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. శ్రీ లీల కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో చివరిగా రాబిన్ హుడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
View this post on Instagram