Sreemukhi : మూడేళ్ల త‌ర్వాత ఒకే వేదిక‌పై క‌నిపించిన శ్రీముఖి, ర‌వి.. ర‌చ్చ మాములుగా ఉండ‌దు మ‌రి!

Authored By Sam C | The Telugu News | Published on: February 19, 2022, 12:30 pm

Sreemukhi : బుల్లితెర‌పై క‌నిపించే క్రేజీ జంట‌ల‌లో శ్రీముఖి-ర‌వి జంట ఒక‌టి. వీరు ఏదైన షో హోస్ట్ చేస్తే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. ప‌టాస్ చాలా ఎపిసోడ్స్ ఈ ఇద్ద‌రు క‌లిసి చేశారు. ఎంత అన్యోన్యంగా ఉండే ఈ జంట స‌డెన్‌గా ఇలా విడిపోవ‌డం అంద‌రికి షాకిచ్చింది. ఆ మ‌ధ్య శ్రీముఖి బిగ్ బాస్ షోకి వెళ్లిన‌ప్పుడు తనను ఒకరు మోసం చేసారని.. పెళ్లి వరకు వచ్చిన తర్వాత అతడి గురించి ఓ దారుణమైన నిజం తెలిసిందని చెప్పింది శ్రీముఖి. దాంతో రవితో రిలేషన్ గురించే ఇన్ డైరెక్టుగా శ్రీముఖి చెప్పిందనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా జరిగింది. సమ్‌థింగ్‌ స్పెషల్’‌ అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న

రవి ఆ తర్వాత శ్రీముఖితో కలిసి చేసిన పటాస్‌ షోతో మరింత ఫ్యాన్‌ బేస్‌ సంపాదించుకున్నాడు. స్టేజ్‌పై వీరిద్దరి టైమింగ్‌, కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులున్నారు. మూడేళ్లుగా ఈ ఇద్ద‌రు క‌లిసి ఒకే స్టేజ్‌పై క‌నిపించింది లేదు. బిగ్‌బాస్‌ మహోత్సవం అనే ఓ షో కోసం వీరిద్దరిని క‌లిసి ఒకే స్టేజ్‌పై చూసే అవ‌కాశం ద‌క్కింది. తాజాగా బిగ్ బాస్ మ‌హోత్స‌వం ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో శ్రీముఖి ఎంట్రీ చూసి ర‌వి షాక్ అయి అలా ఉంటాడు. ఇది చూసి శ్రీముఖి పంచ్ వేసింది.నువ్వు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న‌ప్పుడు, బిగ్ బాస్ నిన్ను ఎలిమినేట్ చేసిన‌ప్పుడు అయిన షాక్ కంటే ఇది పెద్ద షాక్ కాదులే అని శ్రీముఖి సెటైర్ వేసింది. ఇక కాజ‌ల్ కి ఛాన్స్ ఇస్తే షో మొత్తం ఆమెనే చేసేస్తుంది అని పేర్కొంది.

Sreemukhi appeared on stage three years later

Sreemukhi appeared on stage three years later

Sreemukhi : రెచ్చిపోయిన జంట‌..

ఇక హౌజ్ మేట్స్ అంద‌రు స‌ర‌దాగా, సంతోషంగా చిందులు వేయ‌గా ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ‌హ‌ల్ చ‌ల్ చేస్తుంది. మూడేళ్ల త‌ర్వాత ర‌వి శ్రీముఖిని ఇలా క‌లిసి చూడ‌డం సంతోషంగాఉంద‌ని నెటిజ‌న్స్ అంటున్నారు. ఆ మ‌ధ్య ఓ యూట్యూబ్ ఛానల్‌ ఇంటర్వ్యూకి వెళ్లిన రవికి శ్రీముఖితో ఎఫైర్ గురించి ప్రశ్నలు రావడంతో సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ‘మీరు యాంకర్ శ్రీముఖితో డేటింగ్‌లో ఉన్నారట.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారట.. నిజమేనా? అంటూ యాంకర్ ప్రశ్నలు అడగడంతో.. ‘హా!! అవునండీ మా ఇద్దరికీ పిల్లలు కూడా పుట్టేశారు. ఒక హాస్టల్‌లో ఉంటూ టెన్త్ చదువుతున్నాడు. మాట్లాడటానికి కాస్తైనా కామన్‌సెన్స్ ఉండాలి’ అంటూ ఘాటుగా స్పందించారు రవి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp