Sreemukhi : వామ్మో ఏంటి శ్రీ‌ముఖి… ఎవ్వ‌ర్ని వ‌ద‌ల‌వా.. వీడియో !

Authored By aruna | The Telugu News | Published on: September 10, 2021, 7:05 pm

Sreemukhi బుల్లితెరపై ఈ మధ్య కొన్ని ఈవెంట్లు, షోల్లో జరిగిన వాటిని వేరే ఈవెంట్లు, షోలలో వాడుకుంటున్నారు. ఢీలో అతి చేసిన కంటెస్టెంట్లు, జడ్జ్‌లు, యాంకర్లను జబర్దస్త్ వాళ్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక తమ టీంలోనే ఎక్స్ ట్రాలు చేసిన వారిని ఇమిటేట్ చేసి పడేస్తున్నారు. అలా వర్ష, ఇమాన్యుయేల్‌ను దారుణంగా ఆడుకున్నారు. ఆ తరువాత డీ కంటెస్టెంట్ నైనిక, సాయిల పరువుతీసేశారు.

Sreemukhi Gets Imitates In Swamy Vari Sambaralu

Sreemukhi Gets Imitates In Swamy Vari Sambaralu

టిక్ టాక్ భాను పరువుపాయే.. నాటి ఓవర్ యాక్షన్‌పై సెటైర్లు Sreemukhi

ఇక ఇప్పుడు టిక్ టాక్ భాను పరువుతీసేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా రవికృష్ణ, శివజ్యోతి వేసిన స్కిట్‌కు టిక్ టాక్ భాను ఇచ్చిన రియాక్షన్లు నెట్టింట్లో ట్రోలింగ్‌కు గురయ్యాయి. పాప ఓవర్ యాక్షన్ భరించలేకపోయారు. చైల్డ్ ఆర్టిస్టా? మరీ అంత ఓవర్ యాక్షన్ చేస్తోంది అంటూ దూకుడు సినిమాలో బ్రహ్మానందంలా మీమ్స్‌తో చెలరేగిపోయారు.

Sreemukhi Gets Imitates In Swamy Vari Sambaralu

Sreemukhi Gets Imitates In Swamy Vari Sambaralu

శివజ్యోతి, రవికృష్ణ పర్ఫామెన్సే అతిగా ఉందంటే.. దానికి భాను ఇచ్చిన రియాక్షన్లు నభూతో నభవిష్యత్తు. ఇప్పుడు అదే సీన్‌ను రిపీట్ చేసేశారు స్వామి వారు సంబురాలు టీం. వినాయకచవితి సందర్భంగా జీ తెలుగులో వస్తోన్న ఈ ఈవెంట్‌లో టిక్ టాక్ భాను నాడు చేసిన ఓవర్ యాక్షన్‌ను ఇమిటేట్ చేసేశారు. నాకు ఏవేవో గుర్తుకు వస్తున్నాయ్ అంటూ శ్రీముఖి కూడా కౌంటర్ వేసింది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp