Sreemukhi : జ‌ల‌కాలాడుతూ విర‌హ‌వేద‌న చెందుతున్న‌ శ్రీముఖి.. మ‌తులు పోగొట్టేలా పోజులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreemukhi : జ‌ల‌కాలాడుతూ విర‌హ‌వేద‌న చెందుతున్న‌ శ్రీముఖి.. మ‌తులు పోగొట్టేలా పోజులు

 Authored By sandeep | The Telugu News | Updated on :16 June 2022,7:00 am

Sreemukhi : బుల్లితెర యాంక‌ర్స్ హీరోయిన్స్‌ని మంచి అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేస్తున్నారు. కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్నారు. సుదీర్ఘ కాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సందడి చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది అందాలను ఆరబోస్తోంది. ‘జులాయి’తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి విపరీతంగా ఫేమస్ అయిపోయింది.

ఇక యాంక‌ర్‌గా మారిన త‌ర్వాత సుదీర్ఘమైన కెరీర్‌లో శ్రీముఖి ‘అదుర్స్ 2’, ‘మనీ మనీ’, ‘సూపర్ మామ్’, ‘సూపర్ సింగర్’, ‘జోలకటక’, ‘కామెడీ నైట్స్’, ‘బొమ్మ అదిరింది’, ‘పటాస్’ వంటి షోలను నడిపించింది. ప్ర‌స్తుతం జాతిర‌త్నాలు, స‌రిగ‌మ‌ప వంటి షోస్ చేస్తున్న శ్రీముఖి అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియ‌లో మ‌తులు పోగొట్టే అందాలతో మెంట‌లెక్కిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పొట్టి దుస్తుల‌లో మ‌తులు పోగొడుతుంది. స్విమ్మింగ్ పూల్ ద‌గ్గ‌రఈ అందాల ముద్దుగుమ్మ చేస్తున్న ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయే అందంతో ర‌చ్చ చేస్తుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం.

sreemukhi latest pics viral on instagram

sreemukhi latest pics viral on instagram

Sreemukhi : శ్రీముఖి వారెవ్వా..

శ్రీముఖి షేర్ చేసే ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటాయి. శ్రీముఖి షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ ప్యాన్స్ గుండెల్లో గుణపాలుగుచ్చుతున్నాయి.. పొట్టి గౌనులో శ్రీముఖి సోయగాలు చూడాలంటే రెండు కళ్ళు చాలడంలేదు. మోకాళ్ళ పైకి ఉన్న డ్రెస్ లో శ్రీముఖి రచ్చ చేస్తూ.. రెచ్చిపోయింది. యాంకర్‌గా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే శ్రీముఖి బిగ్ బాస్ షోలోకి మూడో సీజన్ కంటెస్టెంట్‌గా వెళ్లింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె.. రన్నరప్‌గానే మిగిలిపోయింది. ఇందులో గెలవకున్నా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. అదే సమయంలో ఆఫర్లను కూడా అందుకుంటోంది. మొత్తానికి ఈ షో తర్వాత స్పీడు పెంచేసి మరీ తన కెరీర్‌ను నడుపుకుంటోంది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది