Home » Entertainment » Sreemukhi New Video Goes Viral
Entertainment

Sreemukhi : స్విమ్మింగ్ పూల్‌లో శ్రీముఖి.. పొట్టి నిక్కర్లో కాకరేపిన రాములమ్మ.. వీడియో..!

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 5, 2021, 4:00 pm
Advertisement

Sreemukhi : బుల్లితెర రాములమ్మ శ్రీముఖి నెట్టింట్లో చేసే రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. శ్రీముఖి తన గ్యాంగ్‌తో కలిసి సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. తన సోదరుడు శుశ్రుత్, స్నేహితుడు ఆర్జే చైతూలతో శ్రీముఖి దుమ్ములేపుతుంటుంది. అయితే ప్రతీ వీకెండ్ ఎక్కడికో ఓ చోటకు వెళ్లి హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు. అలా ఈ వీకెండ్‌కు శ్రీముఖి హైద్రాబాద్ శివారు ప్రాంతాలకు వెళ్లినట్టు కనిపిస్తోంది. ఇక తన ట్రావెలింగ్ వీడియోలను ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తోంది.

Advertisement

Sreemukhi New Video Goes Viral

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్ ఇలా అన్ని చోట్లా శ్రీముఖి రచ్చే కనిపిస్తోంది. గత వారం బోనాల జాతర అంటూ వరుసగా వీడియోలను వదిలింది. అందులో తమన్నా, అవినాష్, శుశ్రుత్, చైతూ, శ్రీముఖి కలిసి రచ్చ చేశారు. అయితే ఈ సారి మాత్రం తమన్నా, అవినాష్ కనిపించలేదు. ఎప్పుడూ గోవా అంటే వెళ్లలేం. అందుకే ఈ సారి కొంపల్లిలోని ఫాంహౌస్‌లోకి వెళ్తున్నాం.. అక్కడ దుమ్ములేపుతున్నామంటూ శ్రీముఖి ఫుల్ ఎగ్జైట్ అయింది. ఈ ట్రావెలింగ్‌కు సంబంధించిన రెండు వీడియోలను షేర్ చేసింది.

Advertisement

Sreemukhi New Video Goes Viral

Sreemukhi  స్విమ్మింగ్‌ పూల్లో శ్రీముఖి రచ్చ..

ఇక రెండో దాంట్లో అయితే అంతా కూడా స్విమ్మింగ్ పూల్ ఘట్టమే ఉంది. శుశ్రుత్, చైతూ ఇద్దరూ కూడా స్విమ్మింగ్‌ పూల్‌లో ఈతకొట్టే పోటీలను పెట్టుకున్నారు. ఇక సందులో సడేమియా అన్నట్టు శ్రీముఖి కూడా స్విమ్మింగ్ పూల్‌లోకి అడుగుపెట్టేసింది. కానీ నీళ్లు మరింత చల్లగా ఉండటంతో ఒక్కసారిగా కేకలు పెట్టేసింది. కానీ ఎలాగోలా మొత్తానికి స్విమ్మింగ్ పూల్‌లో శ్రీముఖి దిగేసింది. తన ఫ్రెండ్‌ను కూడా అందులోకి లాగేసింది. ఇక నెక్స్ట్ వీడియోలో శ్రీముఖి ఇంకేం చూపిస్తుందో మరి.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి