Home » Entertainment » Sreemukhi Photos Viral
Entertainment

Sreemukhi : మల్లెపూలు పెట్టుకుని.. చూపులతోనే మత్తెక్కిస్తున్న శ్రీముఖి..

Authored By
mallesh
The Telugu News | Published on: November 10, 2021, 7:15 am
Advertisement

Sreemukhi : బుల్లితెరపై సందడి చేస్తున్న యంగ్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి.. యాంకరింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రాములమ్మ స్టెప్స్ వేస్తూ ప్రేక్షకులను తన పంచులతో నవ్వించే ప్రయత్నం చేసే శ్రీముఖి… అల్లు అర్జున్ ‘జులాయి’ చిత్రంతో వెండి తెర ఎంట్రీ ఇచ్చేసింది.బుల్లితెర, వెండితెర రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న శ్రీముఖి.. ‘ప్రేమ్ ఇష్క్ కాదల్’ ఫిల్మ్‌లో లీడ్ యాక్ట్రెస్ గా నటించింది. ఇటీవల కాలంలో ఈ భామ నటించిన రెండు చిత్రాలు విడుదలయ్యాయి.

Advertisement

sreemukhi photos viral

‘క్రేజీ అంకుల్స్’ సినిమాలో శ్రీముఖి హీరోయిన్‌గా నటించగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ నితిన్ నటించిన ‘మాస్ట్రో’ సినిమాలో శ్రీముఖి కీలక పాత్ర పోషించింది. ఈ సంగతులు పక్కనబెడితే.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి.. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఓల్డ్ ఫొటో ఒకటి షేర్ చేసింది. సదరు ఫొటో చూసి నెటిజన్లు ‘ఏమున్నవె పిల్ల ఏమున్నవే, వెరీ నైస్, గార్జియస్, బ్యూటిఫుల్ పిక్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఫొటోలో శ్రీముఖి సిల్వర్ అండ్ బ్లాక్ లంగావోణిలో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్నది.

Advertisement

Sreemukhi : లంగావోణిలో కుందనపు బొమ్మలా శ్రీముఖి..

sreemukhi photos viral

జడలో మల్లెపూలు పెట్టుకుని నవ్వుతూ కనిపిస్తోంది. సంప్రదాయానికి ప్రతీక అయిన లంగావోణి లంగావోణిలో రెండు చేతులు తన నడుము మీద పెట్టుకుని అందంగా కనబడుతున్న శ్రీముఖిని చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూపులతోనే మత్తెక్కించే అందం శ్రీముఖి సొంతం అని కొందరు నెటిజన్లు అనుకుంటున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి