Sreemukhi : ఇది కాస్త విచిత్రంగా ఉందే.. ఇంట్లో శ్రీముఖికి అది వేసుకునే అల‌వాటే లేదా….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreemukhi : ఇది కాస్త విచిత్రంగా ఉందే.. ఇంట్లో శ్రీముఖికి అది వేసుకునే అల‌వాటే లేదా….!

 Authored By sandeep | The Telugu News | Updated on :19 August 2022,7:40 pm

Sreemukhi : బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈవిడ నోరు తెరిచిందంటే కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న‌వారికి కూడా వినిపిస్తుంటుంది. అందుకే లౌడ్ స్పీక‌ర్ అని కూడా అంటుంటారు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా ఎదిగిపోయింది. దీంతో రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తోంది. అదే సమయంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తూ దూసుకుపోతోంది.

Sreemukhi : మేక‌ప్‌కి దూరంగా..

శ్రీముఖి ఎక్కడ ఉంటే అక్కడ పెద్ద హంగామానే ఉంటుంది. శ్రీముఖి అందంతో, చలాకీతనంతో అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది. నిజానికి శ్రీముఖి ఇంట్లో ఉంటే అసలు మేకప్ వేసుకోదట. న్యాచురల్ గానే ఉంటుందట. షో కోసమే షోలో అందంగా కనిపించడం కోసమే ఆమె ముఖానికి రంగులు పూసుకుంటుందని అంటున్నారు.

Sreemukhi Video Without Makeup Goes Viral

Sreemukhi Video Without Makeup Goes Viral

ఇటీవ‌ల శ్రీముఖి ఎక్కువ‌గా యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తుంది. ఇందులో ఆమె ఎక్కువ మేక‌ప్ వేసుకోకుండా క‌నిపిస్తుంది. మేకప్ లేకుండా కూడా శ్రీముఖి చాలా చక్కగా కనిపిస్తుంది . దీంతో శ్రీముఖి మేకప్ లేకుండానే బాగుంటుంది అంటున్నారు ఆమె అభిమానులు. చాలా మంది ఇంట్లో కూడా మేక‌ప్ వేసుకొని తెగ సంద‌డి చేస్తుంటారు. కాని శ్రీముఖి వేసుకోకుండా ఉండ‌డంపై ఆమె ఫ్యాన్స్ ఆశ్చ‌ర్యంతో పాటు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. శ్రీముఖి గత ఏడాది ‘క్రేజీ అంకుల్స్’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది