Pawan kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని భయపెడుతున్న శ్రీలంకన్ బ్యూటీ..?

Advertisement

Pawan kalyan : పవన్ కళ్యాణ్ – క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అన్న పాన్ ఇండియన్ సినిమా సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ మేకర్ ఏం.ఎం. రత్నం దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. 17వ కాలం నాటి పీరియాడికల్ సినిమా కావడం తో మేకర్స్ ఈ సినిమాకోసం ఆనాటి పరిస్థితులకు అద్దం పట్టేలా భారీ సెట్స్ ని నిర్మించారు. ప్రస్తుతం ఆసెట్స్ లోనే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సాగుతోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ తో పాన్ ఇండియన్ రేంజ్ లో పవర్ స్టార్ భారీ హిట్ అందుకోబోతున్నాడని సినీ వర్గాలలో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.

మొట్ట మొదటిసారి పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికీల్ సినిమా కావడంతో అంచనాలు తారా స్థాయిలో నెలకొన్నాయి. 2021 సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు, హిందీ, తమిళం,మలయాళ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్‌లోనే గొప్ప సినిమాగా హరిహర వీరమల్లు సినిమా నిలిచే విధంగా దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాతంకంగా తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి రేసులో ఇప్పటికే సర్కారు వారి పాట పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకి పోటీ కాబోతుండగా ఆ సమయానికి మెగాస్టార్, ప్రభాస్ సినిమాలు కూడా పోటీ కాబోతున్నట్టు సమాచారం.

Advertisement
harihara-veeramallu
harihara-veeramallu

ఇంత భారీ అంచనాల మధ్య ఇండస్ట్రీ హిట్ కోసం పవన్ కళ్యాణ్ – క్రిష్ గట్టి ప్రయత్నాలు చేస్తుంటే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్, శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండస్ మాత్రం పవర్ స్టార్ అభిమానులను కంగారు పెడుతోంది. ఈ సినిమాలో జాక్విలిన్ నటిస్తున్నందుకు పవన్ అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. అయితే తాజాగా జాక్విలిన్ ఒక టాప్‌లెస్ ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసి హాట్ టాపిక్ అయింది. ఈ ఫొటోకి నెటిజన్స్ నుంచి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులను మాత్రం ఈ లేటెస్ట్ ఫొటో టెన్షన్ పెడుతుందట. ఇలాంటి హీరోయిన్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తే క్రేజ్ కి డామేజ్ అవుతుందన్న ఆలోచన అన్న మాట వినిపిస్తోంది.

Advertisement
Advertisement