Sri Reddy : శ్రీరెడ్డికి ఇంత తిండి పిచ్చి పట్టిందేంటి.. ఫుల్‌గా లాగించేస్తుందిగా..!
Sri Reddy : శ్రీరెడ్డి గురించి తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కాస్టింగ్ కౌచ్‌తో వార్తలలోకి ఎక్కిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రెచ్చిపోతుంది. ఎన్నో వివాదాల్లో చిక్కుకుని దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది శ్రీరెడ్డి. సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్ ఆమె సొంతం అయింది. దీనికి కారణం సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేయడమే. తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదలే శ్రీరెడ్డి.. అప్పుడప్పుడూ బూతుల రచ్చ చేస్తుంటుంది. ఇటీవల వివాదాస్పద నటి శ్రీరెడ్డి రూటు మార్చింది.సినీ నటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఈమె ప్రస్తుతం వంటకాల చేస్తూ కాలం గడుపుతోంది.
దీనికి సంబంధించిన వీడియోలను నెట్టింట పోస్టు చేస్తోంది. శ్రీరెడ్డి కూడా యూట్యూబ్ సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వీడియోలు చేస్తోంది. సామాజిక, రాజకీయ, సినిమాలపై యూట్యూబ్‌లో స్పందిస్తోంది. అంతే కాకుండా శ్రీరెడ్డి వంట వీడియోలతో ఎక్కువగా అభిమానులను సంపాదించుకుంది. తాను చేస్తున్న వంట వీడియోలకు కాస్త అందాలతో కూడా గార్నిష్ చేస్తోంది. ఇన్ని రోజులు తాను వండిన వంటకాల గురించి చెబుతూ నానా రచ్చ చేసిన శ్రీ రెడ్డి ఇప్పుడు హోటల్‌కి వెళ్లి అక్కడ ఫుడ్ గురించి రివ్యూ ఇచ్చింది. తను డబ్బులు చెల్లించి ఫుడ్ ఆర్డర్ చేసుకొని వాటి గురించి రివ్యూ ఇచ్చింది. జబ్బలు కనిపించేలా జాకెట్ ధరించి శ్రీరెడ్డి తెగ ఆరగించింది.కొందరు ఈ అమ్మడిని చూసి ఇలా తిండిబోతు అయిందేంటని కామెంట్ చేస్తున్నారు.

sri Reddy becomes foody
Sri Reddy : వంటకాలతో రచ్చ..
ప్రస్తుతం శ్రీ రెడ్డి వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్థిరపడాలన్న పట్టుదలతో హైదరాబాద్‌లో అడుగు పెట్టింది శ్రీరెడ్డి. ఆ సమయంలోనే ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసింది. ఆ తర్వాత మోడల్‌గానూ మారింది. అలా చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడిపోయింది. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. సరిగ్గా అప్పుడే ‘నేను నాన్న అబద్ధం’ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత ‘అరవింద్ 2’, ‘జిందగీ’ తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసినా గుర్తింపు దక్కలేదు. దీంతో సినీ రంగానికి ఆమె దాదాపుగా దూరంగా ఉండిపోయింది.
