Sri Reddy : నా అందాలు చూసే ముందు, దీనిని లాగించేయండంటున్న శ్రీ రెడ్డి…!
Sri Reddy : వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి తెలిసిందే. ఆమె అందాల దాడితోనే ఘాటు పదాలతోను నానా రచ్చ చేస్తుంటుంది. ఇటీవల కాలంలో నోరూరించే రుచులు వండుతూ ఆరున్నర మిలియన్ల ఫాలోవర్స్ సంపాదించుకుంది. ఆమె గరిటె తిప్పడం మొదలుపెడితే ఘుమ ఘుమలాడాల్సిందే మరి . వెజ్ నుండి నాజ్ వెజ్ వరకూ ఏ వంటకం అయినా నోరు ఊరించేలా చేయడం శ్రీ రెడ్డి స్పెషాలిటీ. ఒకప్పుడు వివాదాలతో ఎక్కువగా వార్తలలో నిలిచే శ్రీ రెడ్డి ఇటీవలి కాలంలో రుచికరమైన ఘుమఘుమలు వండుతూ హాట్ టాపిక్‌గా నిలుస్తుంది.
ఎప్పటికప్పుడు వెరైటీ వంటకాలతో నోరూరించే శ్రీరెడ్డి తాజాగా గిన్నె కోడి కూర వండింది. ఇప్పటి వరకు యూట్యూబ్‌లో ఈ కోడికూర ఎవరు చేయలేదని చెబుతూనే తనదైన స్టైల్‌లో రుచికరమైన కర్రీ వండింది. శ్రీరెడ్డి పలు సూక్తులు తెలియజేస్తూ వంట వండిన విధానం నెటిజన్స్‌కి తెగ నచ్చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు వండిన రుచికరమైన కోడి కూర చూస్తేనే తినాలనిపిస్తుంది.తెలుగింటి వంటకాలతో పాటు తమిళ రుచులను టేస్ట్ చేయిస్తోంది శ్రీరెడ్డి. తను తినడమే కాదు.. తన స్నేహితులు ఎవరైనా ఇంటికి వస్తుంటే రుచిగా వండి వడ్డించడం ఆమెకు అలవాటు అని చెబుతుంది.
Sri Reddy : అదరగొట్టేసిందిగా..!
ఇటీవల శ్రీరెడ్డి స్పైసీ రెసిపీస్ లిస్ట్‌లో చికెన్, మటన్, గోంగూర చికెన్, రోటి బెండకాయ పచ్చడి, రాగి సంగటి, మురుగన్ దాల్ విత్ పెసరట్టు, డైట్ చికెన్, చికెన్ ఫ్రై, పప్పు, ఎగ్ పులుసు, పులిహోర, రసం ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె గరిటె తిప్పిన వంటకాల లిస్ట్ చాంతాడంత ఉంది. ఒకవైపు మత్తెక్కించే అందాలు మరోవైపు యమ్మీ యమ్మీ రుచులతో నోరూరిస్తుండటంతో శ్రీరెడ్డి స్పైసీ వంటకాలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఈవిడ వంటకాలు చేస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో వీడియో అప్‌లోడ్ చేస్తుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
