sri reddy comments on mahesh babu
Sri reddy: సౌత్ సినిమా ఇండస్ట్రీలో శ్రీరెడ్డి గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. నటిగా కంటే కాంట్రవర్సీలతోనే విపరీతంగా పాపులారిటీ తెచ్చుకుంది. తనని టాలీవుడ్ ప్రముఖులు వాడుకొని వదిలేశారని, అవకాశాల కోసం నన్ను వాళ్ళకి నచ్చినట్టు ఉపయోగించుకున్నారని ఓపెన్‌గా మాట్లాడి ఒక దశలో అంతటా హాట్ టాపిక్ అయింది. ఏకంగా ఫిలిం ఛాంబర్ ముందు ధర్నాకే దిగింది. ఇండస్ట్రీలో హీరోల గురించి, దర్శకుల గురించి, నిర్మాతల కొడుకుల గురించి ఎన్నో సెన్షేషనల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇంత చేసినా ఆమెను ఎవరూ టార్గెట్ చేయకపోవడం ఆసక్తికరం.
sri reddy comments on mahesh babu
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి కూడా ఆయన అభిమానులతో చీవాట్లు తినింది. ఈ విషయంలో కూడా ఎన్నో కామెంట్స్ చేసింది. ఇష్యూ పెద్దదయ్యాక కొన్నాళ్ళు సైలెంట్ అయింది. అంతేకాదు నెమ్మదిగా చెన్నై వెళ్ళిపోయింది. అక్కడ కూడా ఇదే తంతు సాగించింది. అక్కడ ప్రముఖుల మీద ఇలాంటి కామెంట్స్ చేసే వార్తల్లో నిలిచింది. సొంత యూట్యూబ్ ఛానల్ లో కూడా శ్రీరెడ్డి చెలరేగిపోయింది. ఈ మధ్య తన హడావుడి తగ్గిపోయింది. ఎవరినీ పట్టించుకోవడం లేదు. చెప్పాలంటే శ్రీరెడ్డి గురించి మర్చిపోయారు. ఇలాంటి సమతంలో టాలీవుడ్ స్టార్ హీరో మీద కామెంట్స్ చేసి మళ్ళీ రాకెట్‌లా దూసుకొచ్చింది.
sri reddy comments on mahesh babu
ఆయనే సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇప్పటి వరకు శ్రీరెడ్డి టాలీవుడ్ హీరోలలో ఎవరి గురించైనా పాజిటివ్‌గా మాట్లాడింది అంటే అది మహేశ్ బాబు, జూనియర్ ఎన్.టి.ఆర్ గురించే. ఇప్పటికే పలు సందర్భాలలో వారి గురించి మంచిగా మాట్లాడింది. తాజాగా కూడా మహేశ్ బాబు సిమ్లా ఆపిల్ లా ఉన్నాడు బాబు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేసింది. సైమా అవార్డ్స్ 2021 కి గానూ మహేశ్ బాబుకి ఆయన నటించిన మహర్షి సినిమాకి అవార్డు దక్కించింది. ఇందులో భాగంగా ఆయన దర్శకుడు వంశీ పైడిపల్లి అవార్డుల కోసం సైమా అవార్డ్స్ గ్రాండ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి రెడ్ కార్‌పేట్‌పై వస్తున్న మహేశ్ స్టిల్ ట్యాగ్ చేసి సిమ్లా ఆపిల్ లా ఉన్నాడు బాబు అంటూ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.