samantha-shocking comments once again
Samantha: ఈ మధ్య సోషల్ మీడియాతో పాటు అన్నీ మీడియా ఛానల్స్‌లోనూ హాట్ టాపిక్ అంటే సమంత – నాగ చైతన్యల డివోర్స్ మ్యాటరే. గతకొన్ని రోజులుగా వారిద్దరు కలిసి ఉండటం లేదని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. అంతక ముందు సమంత – చైతన్య ఎక్కడ కనిపించినా ఒకరికొకరు అతుక్కునే కనిపించేవారు. కానీ ఈ మధ్య మాత్రం ఇద్దరు కలిసి ఒకే చోట కనిపించడం లేదు. ఎవరికి వారు వేరే ప్రయాణాలు, ఫంక్షన్లు అటెండ్ అవుతున్నారు. దీంతో నిజంగానే వీరు విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. చైతు – సామ్ ఒకరి గురించి ఒకరు మాట్లడటానికి ఇష్టపడం లేదు.
samantha-shocking comments once again
ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో సమంత చేస్తున్న హంగామా చూస్తే ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు. తను పెడుతున్న కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి పెడుతుందో కూడా కన్‌ఫ్యూజన్‌గా ఉంటోంది. అలాంటి కామెంట్స్ తాజాగా పెట్టి మళ్ళీ వార్తల్లో నిలిచింది సమంత. ‘నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను.. నీ మొహాన్ని ఎంతో మిస్ అవుతున్నాను. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి.. నువ్ ఎలా అయితే నీ పక్క వారిని నవ్విస్తూ సంతోషంగా చూసుకుంటావో.. నిన్ను కూడా అలానే చూసుకునేవారి మధ్యలో ఉంచమని ఆ దేవుడిని నేను ప్రార్థిస్తాను..హ్యాపీ బర్త్ డే వెన్నెల కిషోర్.. అని చెప్పుకొచ్చింది.
samantha-shocking comments once again
అర్థమైంది కదా ..సమంత ఎవరికి ఆ పోస్ట్ పెట్టిందో. ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్‌కి. ఈనెల 19న వెన్నెల కిషోర్ బర్త్ డే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ తారలందరూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే సమంత కూడా వెరైటీగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ వెన్నెల కిషోర్‌కి బర్త్ డే విషెస్ తెలిపింది. కాగా సమంత ప్రస్తుతం ఓ తమిళ మల్టీస్టారర్ మూవీ కోసం చెన్నైలో ఉంటోంది. ఇటీవలే మరో కొత్త ప్రాజెక్ట్ కమిటయినట్టు సమాచారం. ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ సమంత – నాగ చైతన్యలు కలిసి ఒకేసారి ఎప్పుడు రూమర్స్‌కి చెక్ పెడతారనేది తెలియడం లేదు.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.