Sri Reddy : సముద్రపు చేపలతో రచ్చ చేసిన శ్రీ రెడ్డి …చేపల పులుసు మాములుగా లేదు…. వీడియో !

Authored By Sam C | The Telugu News | Updated on: April 7, 2022, 11:21 am

Sri Reddy : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి అనే పేరుకి అస్సలు పరిచయం అక్కర్లేదు. ఆమె వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. ఎప్పుడూ ఏదొక ఇష్యూతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రాజకీయాలు క్యాస్టింగ్ కౌచ్ ఇలా అన్ని విషయాల్లో శ్రీ రెడ్డి వివాదాలతో ఉంటుంది. టాపిక్ ఏదైనా కుండ బద్దలు కొడుతుంది. ఏపీ పాలిటిక్స్ లోనూ తన నోటి దురుసు చూపించింది. ఇక వైసీపీకి తన మద్దతు తెలిపుతూ.. ఆ పార్టీని ఏదైనా అంటే శ్రీరెడ్డి తన విశ్వరూపం చూపిస్తుంది.

కఠినమైన పదాలతో విరుచుకుపడుతుంది. ప్రతి పక్షాలను ఉతికి ఆరేస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ పై కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. రీసెంట్ గా ఆయన నటించిన భీమ్లా నాయక్ సినిమాపై కామెంట్స్ చేసింది. కేవలం రాజకీయ లబ్ది కోసమే సినిమాలు తీస్తున్నావంటూ కామెంట్స్ చేసింది. ఇక ఎన్ని డ్రామాలు ఆడినా నువ్వేం చేయలేవంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ మధ్య కాలంలో శ్రీరెడ్డి సొంత యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసింది. సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు, ఎండు చేపలు లాంటి పల్లెటూరి వంటలు చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది.

Sri Reddy Cooking in sea video

Sri Reddy Cooking in sea video

ఈ వీడియోలకు భారీ ఎత్తున వ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలో సముద్రంలో తానే స్వయంగా చేపలు పట్టి మరీ కూర వండేస్తుంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక శ్రీ రెడ్డి యూట్యూబ్ లోనూ తన టాలెంట్ ను చూపించేస్తుంది. ఈ వీడియోలకు భారీగా వ్యూస్, షేర్లు కూడా రావడం గమనార్హం. సోషల్ మీడియాలో నెటిజన్లు రెస్పాన్డ్ అవుతూ.. చివరకు శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో వంటలు చేసుకుంటుందన్నమాట అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆమె గతంలో డిబెట్లు, చర్చలతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పటికీ వివాదాల్లో తన దైన స్టైల్ లో కామెంట్స్ చేస్తుంటుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp