Sri Reddy : న‌ల్లి బొక్క‌ల కూర వండిన శ్రీ రెడ్డి.. పీల్చి పిప్పి చేస్తుందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sri Reddy : న‌ల్లి బొక్క‌ల కూర వండిన శ్రీ రెడ్డి.. పీల్చి పిప్పి చేస్తుందిగా..!

Sri Reddy : ఒక‌ప్పుడు సినిమాల‌లో సంద‌డి చేసిన శ్రీ రెడ్డి ఆ త‌ర్వాత కాస్టింగ్ కౌచ్ ఇష్యూతోతెగ హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేయడమే. అలాగే తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. శ్రీరెడ్డి నోరు తెరిస్తే బూతులు ఎలా వస్తాయో.. గరిటె పట్టిందంటే ఘుమఘుమలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. ఈ మధ్య కాలంలో విలేజ్ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :15 May 2022,1:04 pm

Sri Reddy : ఒక‌ప్పుడు సినిమాల‌లో సంద‌డి చేసిన శ్రీ రెడ్డి ఆ త‌ర్వాత కాస్టింగ్ కౌచ్ ఇష్యూతోతెగ హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేయడమే. అలాగే తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. శ్రీరెడ్డి నోరు తెరిస్తే బూతులు ఎలా వస్తాయో.. గరిటె పట్టిందంటే ఘుమఘుమలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. ఈ మధ్య కాలంలో విలేజ్ స్టైల్ వంటకాలతో రుచిచూపిస్తున్న శ్రీరెడ్డి.. తాజాగా న‌ల్లి బొక్క‌ల‌కూర వండింది.

ఇన్నాళ్లు ఆంధ్రావాళ్ల కోసం వంట‌లు చేసిన శ్రీ రెడ్డి తెలంగాణ వాళ్ల కోసం ఇది చేసాన‌ని చెప్పుకొచ్చింది. నాటు మాటలతో మసాలా ఘాటు దట్టించి కూర వండేసింది శ్రీరెడ్డి.ఈ కూర తింటే రాత్రంతా మూలుగుడే మూలుగుడు అని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి. ఘాటు అందాల‌తో మ‌సాల కూర వండిన శ్రీ రెడ్డి వావ్ అనిపించింది. ఈ అమ్మ‌డి వంట‌ల‌కు సంబంధించిన వీడియోల‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. శ్రీ రెడ్డి ఆరంభంలో ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసింది. అలా చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే ‘నేను నాన్న అబద్ధం’ అనే సినిమాతో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత ‘అరవింద్ 2’, ‘జిందగీ’ వంటి వాటిలో నటించింది.

sri reddy special curry Video

sri reddy special curry Video

Sri Reddy : ఘుమ ఘుమ‌లు..

ఆ తర్వాత వెండితెరకు దూరమైపోయింది.ఆ మధ్య కాలంలో టీవీ డిబెట్లలో కొంత మంది సినీ ప్రముఖులపై విరుచుకు పడిన శ్రీరెడ్డి.. సోషల్ మీడియా ద్వారా ఎంతో మందిని టార్గెట్ చేసింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, స్టార్ హీరోయిన్లపై వివాదాస్పద పోస్టులు చేసింది. ఇప్పటికీ కొంత మంది స్టార్ హీరోలను విమర్శిస్తూ కామెంట్లు చేస్తూనే ఉంది. దీంతో ఆమె ఎంతో మందికి శత్రువులా మారిపోయింది.ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో ఉన్న‌ప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కులకి మాత్రం చాలా ద‌గ్గ‌ర‌గానే ఉంటుంది. ఈ అమ్మ‌డికి సంబంధించిన ఏ పోస్ట్ అయిన వైర‌ల్ అవ్వాల్సిందే మ‌రి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది