Nagarjuna – Sridevi : నాగార్జునతో నటించడానికి అప్పట్లో శ్రీదేవి ఎందుకు వెనకాడింది.. ఆ విషయంలో భయపడిందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nagarjuna – Sridevi : నాగార్జునతో నటించడానికి అప్పట్లో శ్రీదేవి ఎందుకు వెనకాడింది.. ఆ విషయంలో భయపడిందా?

 Authored By kranthi | The Telugu News | Updated on :21 November 2022,1:00 pm

Nagarjuna – Sridevi : అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. తను దేవకన్య. ఇండస్ట్రీలో శ్రీదేవి లాంటి హీరోయిన్ ఇప్పటి వరకు రాలేదు.. మున్ముందు కూడా వచ్చే అవకాశం లేదు. శ్రీదేవికి ఉన్న అందం అటువంటిది. తనతో సినిమాల్లో నటించాలని కోరుకోని హీరో లేడు. అందరూ హీరోల డేట్స్ కోసం క్యూ కడితే.. అప్పట్లో శ్రీదేవి డేట్స్ కోసం క్యూ కట్టారు. అది తనకు ఉన్న క్రేజ్, రేంజ్. అయితే.. శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్ కు మనవరాలిగానూ నటించింది. ఆ తర్వాత ఆయన సరసన హీరోయిన్ గానూ నటించింది. అలాగే..

ఏఎన్నార్ పక్కన హీరోయిన్ గా నటించి.. ఆయన కొడుకు నాగార్జున పక్కన కూడా హీరోయిన్ గా నటించింది. ఆఖరు పోరాటం సినిమాలో శ్రీదేవిని హీరోయిన్ గా తీసుకోవాలని రాఘవేంద్రరావు అనుకున్నారట. నాగార్జున, శ్రీదేవి జంట అయితే బాగుంటుందని అనుకున్నారట. నాగార్జునకు జోడిగా అనగానే శ్రీదేవి ముందు తటపటాయించిందట. అసలే కుర్ర హీరో. అతడి పక్కన నటిస్తే.. రొమాన్స్ చేస్తే జనాలు ఏమనుకుంటారు. అందులోనూ తన తండ్రితోనూ హీరోయిన్ గా నటించా కదా. వర్కవుట్ అవుతుందా? నాకు ఎలాంటి సమస్య లేదు కానీ..!

sridevi and nagarjuna super hit combination in olden days

sridevi and nagarjuna super hit combination in olden days

Nagarjuna – Sridevi : శ్రీదేవిని నాగార్జునతో నటించమంటే ఏమన్నదో తెలుసా?

జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సందేహం వ్యక్తం చేసిందట శ్రీదేవి. దీంతో.. రాఘవేంద్రరావు మాత్రం ఆ విషయాన్ని నాకు వదిలేయ్.. మీ జంటను మోస్ట్ రొమాంటిక్ జంటగా తీర్చిదిద్దుతా. జనాలకు నేను కనెక్ట్ చేస్తా అని శ్రీదేవికి మాటిచ్చాడట రాఘవేంద్రరావు. అలా ఇద్దరూ కలిసి ఆఖరు పోరాటం సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు వాళ్ల జంటకు కూడా మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి ఆ జంట సూపర్ సక్సెస్ అయింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది