Sridevi Drama Company : రవికృష్ణ నవ్యస్వామికి పెళ్లి.. బుల్లితెరపై మరో కొత్త జంట!

Authored By Cinema Desk | The Telugu News | Published on: February 20, 2021, 1:40 pm

Sridevi Drama Company : బుల్లితెరపై సీరియల్ నటీనటుల మధ్య ప్రేమలు పుట్టడం, పెళ్లిళ్లు చేసుకోవడం అంతా కామన్ అవుతోంది. అయితే ఈ మధ్య మాత్రం ఓ జంట బాగా క్లిక్ అయింది. ఆమె కథ ఫేమ్ నవ్య స్వామి, రవికృష్ణ మాత్రం తెరపై ఎంత కెమిస్ట్రీ కుదిరిందో.. తెర వెనుకా అంతే కుదిరింది. ఆ మధ్య ఇద్దరికీ ఒకే సారి కరోనా వచ్చింది. ఇద్దరూ ఒకే రకమైన బాధలు అనుభవించారు. మొదటగా నవ్యస్వామి పాజిటివ్ అని తేలింది. ఆ తరువాత రవికృష్ణకు కూడా పాజిటివ్ అని వచ్చింది.

Navya Swamy Ravi krishna weds In Sridevi Drama Company

Navya Swamy Ravi krishna weds In Sridevi Drama Company

అయితే రవికృష్ణ, నవ్యస్వామి కలిసి ఎన్నో షోల్లో, ప్రత్యేక ఈవెంట్‌లలో రచ్చ చేశారు. అయితే ఈ ఇద్దరి మధ్యే ఏదో నడుస్తోందని గాసిప్పుళ్లు మొదలయ్యాయి. అలా వస్తోన్న రూమర్లను శ్రీదేవీ డ్రామా కంపెనీ వాడుకోవడం మొదలుపెట్టింది. అందుకే ఈ ఆదివారం ప్రసారం కాబోతోన్న ఎపిసోడ్‌లో రవికృష్ణకు, నవ్యస్వామికి పెళ్లి అంటూ కలరింగ్ ఇచ్చేశారు. అయితే అది కేవలం షో కోసమే అని తెలుస్తున్నా వారిద్దరి కెమిస్ట్రీ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది.

Sridevi Drama Company : రవికృష్ణ నవ్యస్వామికి పెళ్లి..

ముద్దులతో ముంచెత్తతున్నారు. నవ్యస్వామికి రవికృష్ణ పెట్టిన ముద్దు ఒకెత్తు అయితే.. రవికృష్ణకు నవ్యస్వామి పెట్టిన ముద్దు, ఆ సమయంలో రవికృష్ణ చేసిన కొంటెపనులు ఒకెత్తు. నుదురు మీదు ముద్దుపెట్టాలని నవ్యస్వామి చూస్తే తల కొంచెం పైకి ఎత్తడంతో లిప్ కిస్ వరకు వ్యవహారం వెళ్లింది. కానీ నవ్యస్వామి మత్రం నుదురు మీదే ముద్దుపెట్టేసింది. మొత్తానికి ఈ ఇద్దరికి పెళ్లి అంటూ ఏదో ట్విస్ట్ ఇవ్వబోతోంది శ్రీదేవీ డ్రామా కంపెనీ. అదేంటో చూడాలి మరి.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp