Home » Entertainment » Sridevi Drama Company New Anchor Coming Soon
Entertainment

Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీని కూడా ఆగం ఆగం చేస్తున్న మల్లెమాల టీం …!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 17, 2022, 1:00 pm
Advertisement

Sridevi Drama Company : దేశంలోనే అత్యధిక రేటింగ్ దక్కించుకున్న టీవీ కామెడీ షో,TV comedy show, గా జబర్దస్త్ Jabardasth, ఒకానొక సమయం లో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు జబర్దస్త్,Jabardasth, స్థానం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. భారీ కాస్టింగ్ లతో జబర్దస్త్ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటే కన్నుల విందుగా అనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారి పోయింది. జబర్దస్త్ ని కనీసం యూట్యూబ్ లో చూసేందుకు కూడా ఆసక్తిగా లేదు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం మల్లెమాల, Mallemala వారు కమెడియన్స్ కి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి వస్తుందని సాగనంపుతున్నారు.

Advertisement

ఇప్పుడు అదే పరిస్థితి శ్రీదేవి డ్రామా కంపెనీ, Sridevi Drama Company,లో కూడా జరగబోతుంది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జబర్దస్త్ తో పోలిస్తే శ్రీదేవి డ్రామా కంపెనీ,Sridevi Drama Company,కి రేటింగు కాస్త తక్కువగానే ఉంటుంది. అయినా కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ విషయంలో మల్లెమాల వారు చాలా శ్రద్ధ కనబరిచారు అనడంలో సందేహం లేదు. కానీ ఇప్పుడు ఆ శ్రద్ధ చూపడం లేదు. సుదీర్ వెళ్లి పోయిన తర్వాత రష్మీ గౌతమ్ ని యాంకర్ గా తీసుకొచ్చారు. ఆమెని కంటిన్యూ చేస్తే బానే ఉంటుంది, కానీ ఆమె స్థానంలో సౌమ్య రావు ని యాంకర్ గా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ సమాచారం అందుతుంది.

Sridevi Drama Company new anchor coming soon

Advertisement

రష్మి గౌతమ్, Rashmi Gautam, పారితోషికంతో పోలిస్తే సౌమ్య రావు పారితోషికం చాలా తక్కువు.. దాదాపుగా సగం. కనుక కచ్చితంగా కాస్ట్‌ కట్టింగ్ పేరుతో మల్లెమాల వారు సౌమ్యను శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క కొత్త యాంకర్ గా తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రత్యేక ఎపిసోడ్ సందర్భంగా సౌమ్య సందడి చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఆ ప్రోమో చూస్తుంటే శ్రీదేవి డ్రామా కంపెనీ,Sridevi Drama Company, కొత్త యాంకర్ సౌమ్య అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం క్లారిటీ రాలేదు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి