Home » Entertainment » Sridevi Rejected Bollywood Movie For Super Star Krishna Movie
Entertainment

Sridevi : సూపర్ స్టార్ కృష్ణ అంటే శ్రీదేవికి అంత పిచ్చా.. బాలీవుడ్ ఛాన్స్ కూడా వదులుకుని ఆ సినిమాలో నటించిందా.?

Authored By
Rame Samhith
The Telugu News | Updated on: October 19, 2022 9:49 am
Advertisement

Sridevi : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన సాహసాలు అన్ని ఇన్నీ కావు. తెలుగు సినిమాలో టెక్నికల్ గా ఏదైనా కొత్తగా చేయాలంటే అది కృష్ణ గారే చేస్తారు.. హీరోగానే కాదు దర్శక నిర్ర్మాతగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన స్టార్ ఆయన. 80,90వ దశకంలో సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. అప్పట్లో ఆయన ఏడాదికి 12 నుంచి 14 సినిమాల దాకా చేశారు. అప్పట్లో అందరి హీరోయిన్స్ తో జత కట్టిన కృష్ణ శ్రీదేవితో కూడా చాలా సినిమాలు చేశారు. కృష్న, శ్రీదేవి సూపర్ హిట్ జోడీ. వీరిద్దరి జోడీగా చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచ్ ఫలితాన్ని ఇచ్చాఇ.

Advertisement

సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి కలిసి దాదాపు 31 సినిమాల్లో నటించారు. ముఖ్యంగా కృష్ణ గారి సినిమా కోసం శ్రీదేవి బాలీవుడ్ ఆఫర్ ని కూడా కాదని ఆయనతో సినిమా చేసిందట. ఇంతకీ ఆ సినిమా ఏది అంటే మహారాజశ్రీ మాయగాడు. విజయ బాపినీడు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కృష్ణ సరసన శ్రీదేవి నటించారు. ఈ సినిమా టైం లో ఆమెకు హిందీ ఆఫర్లు వచ్చినా తనకు ఈ సినిమాలో పాత్ర నచ్చడమే కాకుండా కృష్ణ గారితో నటించాలనే ఆలోచనతో ఆమె ఈ సినిమాకు సైన్ చేసింది.మహారాజశ్రీ మాయగాడు సినిమా కన్నడ సినిమాకు రీమేక్ గా వచ్చింది.

sridevi rejected bollywood movie for super star krishna movie

Advertisement

సింగీతం శ్రీనివాస రావు డైరక్షన్ లో వచ్చిన భాగ్యదా లక్ష్మి బారమ్మ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ వచ్చింది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో మాధవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని శ్రీనివాస ప్రొడక్షన్స్ లో అట్లూరి రాధాకృష్ణ నిర్మించారు. సెప్టెంబర్ 8 1988లో ఈ మూవీ రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో సూప స్టార్ కృష్ణ కృష్ణమూర్తి పాత్రలో నటించారు. యాక్షన్ ఇమేజ్ ఉన్న కృష్ణ గారు కామెడీ పాత్రలో నటించిన సినిమా ఇది. అయినా సరే ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి సక్సెస్ అందించారు.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి