Sridevi Sister : శ్రీదేవి చెల్లి ఎలాంటి పని చేసిందో తెలిస్తే .. ‘హవ్వా’ అంటారు ..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: November 30, 2022, 8:30 pm

Sridevi Sister : అతిలోక సుందరి శ్రీదేవి అందం గురించి నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అప్పట్లో శ్రీదేవి తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఆమెకు అంత క్రేజ్ రావడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నే కారణం ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్ళాక నేషనల్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు శ్రీదేవి ఇద్దరి కూతుర్లలో జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేసింది. అలాగే తెలుగులో స్టార్ హీరోల సరసన నటించే ప్రయత్నంలో ఉంది. శ్రీదేవి రెండవ కూతురు కూడా సినిమాలోకి వస్తుందో లేదో మరికొద్ది రోజులు వేచి చూడాలి.

ఇక శ్రీదేవి చెల్లి అయిన మహేశ్వరి కూడా తెలుగులో హీరోయిన్గా నటించింది.మహేశ్వరి శ్రీదేవికి కజిన్ అవుతుంది. మహేశ్వరి అందం, అభినయంతో తెలుగులో హీరోయిన్గా చేసి మెప్పించింది. తెలుగులో అమ్మాయి కాపురం తో కెరీర్ మొదలుపెట్టిన గులాబి సినిమా ఆమెకు పెద్ద హిట్ను ఇచ్చింది. ఆ తర్వాత పెళ్లి, నీకోసం, తిరుమల తిరుపతి వెంకటేశ, మా అన్నయ్య సినిమాలు చేసి మంచి పాపులారిటీని దక్కించుకుంది. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలో ఎందరో హీరోలతో నటించి మెప్పించింది. ఆ తర్వాత వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది.

Sridevi Sister affair with that hero

Sridevi Sister affair with that hero

ఆ తర్వాత సీరియల్స్ తో రీఎంట్రీ ఇచ్చింది. జీ తెలుగులో వచ్చిన మై నేమ్ ఇస్ మంగతాయారు సీరియల్ ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే మహేశ్వరి అప్పట్లో ఓ హీరోతో ఎఫైర్ నడిపిన వార్తలు వచ్చాయి. ఆ హీరో ఎవరో కాదు జేడి చక్రవర్తి. మహేశ్వరి, జేడి చక్రవర్తి కాంబినేషన్లో గులాబీ, దయ్యం, మృగం సినిమాలు వెంట వెంటనే వచ్చాయి. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడిచిందని టాక్ వచ్చింది. ఇది నిజమో కాదు తెలియదు కానీ అప్పుడు వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవారట. ఏది ఏమైనా అప్పట్లో ఈ వార్త బాగా వైరల్ అయింది.

Also read

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp