Sreemukhi : బుట్టబొమ్మలా రెడీ అయిన శ్రీముఖి.. హాఫ్ శారీలో అందాలు ఆరబోసింది

Authored By Breaking News 2 | The Telugu News | Published on: November 22, 2022, 9:00 pm

Sreemukhi : యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ఇప్పుడు తెలుగు బుల్లితెర మీద నెంబర్ వన్ యాంకర్ అని చెప్పుకోవచ్చు. తెలుగులో ఏ షో అయినా సరే.. దాన్ని శ్రీముఖి చేయాల్సిందే. అది శ్రీముఖి రేంజ్. శ్రీముఖి అందం, అభినయం మామూల్ది కాదు. తను యాంకరింగ్ చేస్తే అదిరిపోవాల్సిందే. అంతే కాదు.. తనకు సోషల్ మీడియాలోనూ బీభ్సతమైన ఫాలోయింగ్ ఉంది. స్టార్ మాలో ప్రస్తుతం పలు షోలలో శ్రీముఖి యాంకర్ గా ఉంది. అలాగే..

ఆహా ఓటీటీలో కూడా శ్రీముఖి డ్యాన్స్ ఐకాన్ అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇక.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శ్రీముఖి.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేసి తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా హాఫ్ శారీలో ఫోటోలు దిగి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. బుట్టబొమ్మలా హాఫ్ శారీలో శ్రీముఖి అందాలు ఆరబోయడం చూసి నెటిజన్లు మాత్రం తట్టుకోలేకపోతున్నారు.

srimukhi latest photoshoot viral

srimukhi latest photoshoot viral

Sreemukhi : ఎంత సక్కగున్నావే లచిమీ అంటూ నెటిజన్ల కామెంట్స్

వామ్మో.. శ్రీముఖి ఏంటా అందం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎంత సక్కగున్నావే లచిమీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హాఫ్ శారీలో నీ అందం రెట్టింపు అయింది అంటూ తన ఫోటోలను సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. స్టార్ మాలో ప్రసారం అయ్యే స్టార్ మా పరివారం అనే షో కోసం శ్రీముఖి ఈ కాస్ట్యూమ్స్ లో రెడీ అయిందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి మరి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp