Srimukhi : యంగ్ హీరోతో సీక్రెట్ ప్రేమాయణం నడుపుతున్న శ్రీముఖి.. ఈ ఏడాదే పెళ్లి
Srimukhi : అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి ఇటీవల ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. షోస్, సినిమాల కన్నా కూడా తన ప్రేమ, పెళ్లి విషయాలతో హైలైట్‌గా నిలుస్తుంది. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రీముఖి తొలుత పలు సినిమాలలో నటించి ఆ తర్వాత యాంకర్‌గా మారింది. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ఈ సినిమాలో తన క్యూట్ యాక్టింగ్‌తో ఎంతగానో ఆకట్టుకుంది. పటాస్ షోలో తన యాంకరింగ్‌తో అదరగొట్టడం, ఆ తర్వాత వరుస అవకాశాలు రావడం వాటిని సద్వినియోగం చేసుకోవడం శ్రీముఖి పేరు మారుమ్రోగిపోవడం మనం చూశాం. బిగ్ బాస్ షోలో కూడా శ్రీముఖి సందడి చేసింది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి బ్యాక్ టు బ్యాక్ ఫొటో షూట్స్ షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. జిగేల్ అనిపించే సొగసుతో అట్రాక్ట్ చేస్తూ కుర్రాళ్లని తనవైపుకు తిప్పుకుంటుంది.. శ్రీముఖి కొన్నాళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోందని , త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తనపై వచ్చిన ట్రోలింగ్‌ను లైట్ తీసుకునే శ్రీముఖి..తాను సైతం డబల్ మీనింగ్ డైలాగులు వాడటానికి ఏమాత్రం వెనకాడదు. ఏ షోలో చేసిన కూడా అందులో తన మాటలతో, క్యూట్‌నెస్‌తో రచ్చ చేస్తుంటుంది. అయితే శ్రీముఖి కొన్నాళ్లుగా ఓ యంగ్ హీరోతో ప్రేమలో ఉందని, అతనితో కొన్నాళ్లనుండి డేటింగ్ చేస్తుందని త్వరలో అతనితో ఏడడుగులు కూడా వేయనుందని అంటున్నారు.
శ్రీముఖి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబ సభ్యులకు కూడా తెలుసని, కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపిన తర్వాతే వారి పెళ్లికి సంబంధించిన న్యూస్ బయటకు వచ్చిందని చెబుతున్నారు. ఇక ఈ ఏడాది చివర్లో సదరు హీరోతో శ్రీముఖి వివాహం అంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయిన ప్రస్తుతం మాత్రం పలు షోలతో ఫుల్ బిజీగా ఉంది. సినిమాలు కూడా చేస్తూ అలరిస్తుంది. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా ఈ భామ వదులుకోవడం లేదు. చివరిగా చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో కనిపించి సందడి చేసింది. ఇందులో శ్రీముఖి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.