
Trisha : త్రిషనే నా పెళ్లి చెడగొట్టాలని చూసిందంటూ స్టార్ హీరో కామెంట్స్..!
Trisha : చెన్నై చంద్రం త్రిష గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.రెండు దశాబ్దాలుగా సౌత్‌ని ఏలుతున్న ఈ అమ్మడు ఇప్పటికీ తనదైన శైలిలో అలరిస్తూనే ఉంది. మాములుగా ఒక హీరోయిన్ కెరీర్ పది, పదిహేనేళ్లు మాత్రమే ఉంటుంది. అప్పటికే గ్లామర్ తగ్గిపోవడమో, లేదంటే పెళ్లి చేసుకోవడమో వంటివి జరుగుతుంటాయి. అయితే త్రిష మాత్రం రెండు దశాబ్దాల కిందట ఎలాంటి ఫామ్‌లో ఉందో.. ఇప్పుడు కూడా అదే ఫామ్‌ను మేయింటేన్ చేస్తుంటుంది. సౌత్‌లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్‌లలో త్రిష కూడా ఒకరు. ఇక ప్రస్తుతం త్రిష చేతిలో అరడజనకు పైగానే సినిమాలున్నాయి. మళ్లీ అవి ఆశా మాశీ సినిమాలు కాదు. అన్ని భారీ బడ్జెట్ సినిమాలే. అందులో కొన్ని పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి.
త్రిష తన తోటి నటీనటులతో మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంటుంది. టాలీవుడ్ హీరో శ్రీరామ్‌తో కూడా మంచి ఫ్రెండ్‌షిప్ మేయింటేన్ చేస్తుంటుంది. శ్రీరామ్, త్రిష కాంబినేషన్‌లో తొలిసారి ‘మనేసెళ్లమ్’ అనే సినిమా వచ్చింది. 2003లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్ అయింది. కానీ ఈ సినిమా వలన వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అయితే త్రిషతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా తాను అన్ని విషయాలు షేర్ చేసుకుంటునాని, అదే విధంగా తన భార్య వందనకు లవ్ ప్రపోజ్ చేసిన విషయం కూడా చెప్పాడట. అయితే త్రిష, వందన దగ్గరకు వెళ్లి తన గురించి బ్యాడ్‌గా చెప్పిందట. వాడికి చదువులేదు, మంచోడు కాదు, ఇంగ్లీష్ రాదు… ఇలా తన గురించి చెడుగా చెప్పిందట.
Trisha : త్రిషనే నా పెళ్లి చెడగొట్టాలని చూసిందంటూ స్టార్ హీరో కామెంట్స్..!
ఇదే విషయం వందన వచ్చి శ్రీరామ్‌కు చెప్తే షాక్ అయ్యాడట. త్రిషేంటి తన గురించి అలా చెప్పిందని వెళ్లి… డైరెక్ట్‌గా త్రిషనే అడిగాడట. దానికి త్రిష పాపం రా.. తను నా ఫ్రెండ్, నీకెళారా ఇచ్చేదని నవ్విందట. అలా తన పెళ్లి చెడగొట్టాలని త్రిష ట్రై చేసిందని ఫన్నీగా చెప్పుకొచ్చాడు. ఇక శ్రీరామ్ 2008లో వందనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక త్రిష విషయానికి వస్తే.. 2015లో వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. కానీ, కొన్ని రోజులకు వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో త్రిష ఎంగేజ్ మెంట్ ను కూడా క్యాన్సిల్ చేసుకుంది. తర్వాత త్రిష పెళ్లి, లవ్ ట్రాక్ అంటూ తెగ వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ రూమర్లుగానే మిగిలిపోయాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.