Shobana : అందాల నటి శోభన గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. శోభనకు ప్రస్తుతం 54 ఏండ్లు కాగా.. ఇప్పటి వరకు ఆమె పెండ్లి చేసుకోలేదు. ఒకప్పుడు సౌత్ మూవీల్లో ఆమె ఉంటేనే సినిమా హిట్ అవుతుందనే భావన అందరిలో ఉండేది. వన్నె తరగని అందంతో పాటు నటన, నాట్యం, ఇలా సకలా కళలు ఆమె సొంతం. దాదాపు శోభన ఇప్పటి వరకు 230 సినిమాల్లో నటించిన శోభన హిరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ గా చాలా విభాగాల్లో ది బెస్ట్ అనిపించుకుంది. 1970లో మార్చి 21న కేరళలో తిరువనంతపురం జిల్లాలో జన్మించింది శోభన.
ట్రావెన్కోర్ సిస్టర్స్గా పేరొందిన లలిత, పద్మిని, రాగిణిలకు ఈమె మేనకోడలు. వీళ్లు మంచి క్లాసికల్ డ్యాన్సర్లు మాత్రమే కాదు ఎన్నో సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించారు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభన 1984లో ‘ఏప్రిల్ 18’ అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్‌గా మారింది. 1994లో వచ్చిన ‘మణిచిత్రతాఝు’ అనే సినిమాలో శోభన నటనకు నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమాను కన్నడలో ఆప్తమిత్రగా, తమిళంలో చంద్రముఖిగా తర్వాత రీమేక్ చేశారు. ఆ తర్వాత నటి రేవతి దర్శకత్వం వహించిన మిత్రా-మై ఫ్రెండ్ అనే ఇంగ్షీష్ సినిమాలో నటనకు మరో నేషనల్ అవార్డు వచ్చింది. ఇవే కాకుండా ఆమె కెరీర్లో ఎన్నో స్టేట్ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఉన్నాయి. రెండోసారి జాతీయ పురస్కారం వచ్చిన దగ్గర నుంచి సినిమాలను జాగ్రతగా ఎంపిక చేసుకోవడం ప్రారంభించింది శోభన.
1997 తర్వాత తెలుగు సినిమాలకి దూరమైంది శోభన. మధ్యలో మోహన్ బాబు గేమ్ చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత దాదాపు 18ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఆమె `కల్కి2898ఏడీ`లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే మ్యారేజ్ చేసుకోకుండా ఒంటరిగా ఉండటానికి ఓ బలమైన కారణం ఉందట. తాను ఓ హీరోని ప్రేమించిందట. ఎంతో గాఢంగా శోభన ఆ హీరోని ప్రేమించిందని, కానీ అతను హ్యాండిచ్చాడట. అది తట్టుకోలేకపోయిందట శోభన. దీంతో పెళ్లికే దూరమయ్యిందట. ప్రేమలో మోస పోయిన బాధని తట్టుకోలేకపోయిందట శోభన. దీంతో ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక తాను మ్యారేజ్ చేసుకోకూడదని అని నిర్ణయించుకుందట. అలా ఐదు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంది. ఇక ఓ అమ్మాయిని దత్తత తీసుకొని ఆమె ఆలనాపాలనా చూసుకుంటుంది శోభన
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
Ind Vs Aus : సొంత గడ్డపై దారుణమైన ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న భారత India జట్టు ఇప్పుడు…
Health Benefits : పారిజాత మొక్క శాస్త్రీయంగా Nyctanthes arbor-tristis అని పిలుస్తారు. ఇది సువాసనగల, రాత్రిపూట పుష్పించే చెట్టు.…
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
This website uses cookies.