Pushpa 2 : పుష్ప‌2 క్రేజ్ అంటే ఇది కదా.. ఈ సినిమా కోసం ఏకంగా 8 సినిమాలు వదిలేసుకున్న న‌టుడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pushpa 2 : పుష్ప‌2 క్రేజ్ అంటే ఇది కదా.. ఈ సినిమా కోసం ఏకంగా 8 సినిమాలు వదిలేసుకున్న న‌టుడు..!

Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన పుష్ప సినిమా పెద్ద హిట్ కావ‌డంతో ఇప్పుడు పుష్ప‌2 కోసం ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఇంకా 30 రోజుల దాకా బ్యాలెన్స్ ఉందని సమాచారం. దాంతో అనుకున్న టైమ్ కు అంటే డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వస్తుందా? రాదా? అన్న సందేహం ఫ్యాన్స్ లో నెలకొంది. ఇక విడుదలకు ముందే పుష్ప 2 […]

 Authored By ramu | The Telugu News | Updated on :24 July 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Pushpa 2 : పుష్ప‌2 క్రేజ్ అంటే ఇది కదా.. ఈ సినిమా కోసం ఏకంగా 8 సినిమాలు వదిలేసుకున్న న‌టుడు..!

Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన పుష్ప సినిమా పెద్ద హిట్ కావ‌డంతో ఇప్పుడు పుష్ప‌2 కోసం ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఇంకా 30 రోజుల దాకా బ్యాలెన్స్ ఉందని సమాచారం. దాంతో అనుకున్న టైమ్ కు అంటే డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వస్తుందా? రాదా? అన్న సందేహం ఫ్యాన్స్ లో నెలకొంది. ఇక విడుదలకు ముందే పుష్ప 2 క్రేజీ రికార్డును నెలకొల్పింది. ఆ లిస్ట్ లో టాప్ లో నిలిచి ఔరా అనిపించింది.

Pushpa 2 పుష్ప క్రేజ్ అంటే ఇది క‌దా…

అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలతో పాటుగా.. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల లిస్ట్ ను ఐఎండీబీ ప్రకటించింది. జనవరి నుంచి జులై 10 వరకు ఉన్న డేటా ఆధారంగా ఈ జాబితాను విడుద‌ల చేయ‌గా, ఇందులో అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల‌లో టాప్‌లో పుష్ప 2 నిలిచింది. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 కోసం ఏకంగా 8 సినిమాలు వదులుకున్నానని చెప్పుకొచ్చాడు స్టార్ యాక్టర్ శ్రీతేజ్. ఇత‌ను పుష్ప, ధమాకా, మంగళవారం లాంటి విభిన్నమైన సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ పుష్ప 2లో నటించడం కోసం తాను ఏకంగా 8 సినిమాలు వదులుకున్నట్లు స్వయంగా చెప్పాడు.

Pushpa 2 పుష్ప‌2 క్రేజ్ అంటే ఇది కదా ఈ సినిమా కోసం ఏకంగా 8 సినిమాలు వదిలేసుకున్న న‌టుడు

Pushpa 2 : పుష్ప‌2 క్రేజ్ అంటే ఇది కదా.. ఈ సినిమా కోసం ఏకంగా 8 సినిమాలు వదిలేసుకున్న న‌టుడు..!

నేను పది నెలల్లో దాదాపు 8 ప్రాజెక్ట్ ల దాక వదులుకున్నాను. ఎందుకంటే? ఇంత పెద్ద సినిమాలో చేస్తున్నప్పుడు వాళ్లు ఎప్పుడు పిలిస్తే.. అప్పుడు వెళ్లాల్సి వస్తుంది. పైగా షెడ్యూల్స్ కూడా మారుతూ ఉంటాయి. నేను వేరే సినిమాలు ఒప్పుకొని గడ్డం తీసేస్తే.. మళ్లీ ఈ రేంజ్ లో గడ్డం పెరగడానికి చాలా టైమ్ పడుతుంది. దాంతో సినిమాపై ప్రభావం పడుతుంది. కాబట్టి నా లుక్ కోసం ఇన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు శ్రీతేజ్. ప్రస్తుతం శ్రీతేజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘బహిష్కరణ’ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో అంజలి, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో నటించారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది