Home » Entertainment » Ss Rajamouli Comments On Mahesh Babu Movie
Entertainment

SS Rajamouli : బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ చిత్రాల‌ని మించేలా మహేష్ బాబుతో సినిమా ప్లాన్ చేస్తున్న రాజ‌మౌళి

Authored By
Sam C
The Telugu News | Updated on: March 23, 2022 1:40 pm
Advertisement

SS Rajamouli : ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడు రాజ‌మౌళి బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ బాబుతో మ‌రో భారీ బ‌డ్జెట్ చిత్రం చేయ‌నున్న‌రు. ఈ సినిమాపై గ‌త కొద్ది రోజులుగా అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమా ఆఫ్రికన్‌ అడవుల్లో జరిగే థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కనుందని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ హింట్‌ ఇచ్చారు. ఇక ఈ సినిమా సెట్స్‌పైకి కూడా వెళ్లక ముందే మహేష్-రాజమౌళి చిత్రంపై రకరకాల వార్తలు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

ఈ క్రమంలోనే ఈ సినిమాలో మరో సీనియర్‌ హీరో నటించనున్నారని వార్తలు వచ్చాయి. మొదట విక్రమ్‌ అని తర్వాత బాలకృష్ణ అనే చర్చ జరిగింది.ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళి త‌ప్పుడు ప్ర‌చారాలు ఖండించారు. ఈ వార్తల్లో నిజం లేదని, మహేశ్‌తో తీయబోయే మూవీలో సోలో హీరో ఉంటాడని జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్ విష‌యం గురించి ప్రముఖ సినీ విమర్శకుడు భరద్వాజ్ రంగన్‌ తో మాట్లాడుతూ, మహేష్ బాబుతో తన తదుపరి గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మహేష్ బాబు తో సినిమా, బాహుబలి మరియు ఆర్ఆర్ఆర్ క‌న్నా పెద్దదిగా ఉండబోతోందని అన్నారు.

SS Rajamouli is planning movie with Mahesh Babu

Advertisement

SS Rajamouli : రాజ‌మౌళి వ్యాఖ్య‌లతో పెరిగిన అంచ‌నాలు…

రాజమౌళి చేసిన ఈ ప్రకటన వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు మ‌రిన్ని అంచ‌నాలు పెంచేసుకుంటున్నారు.ప్రస్తుతం మహేష్ బాబు .. ‘సర్కారు వారి పాట’ సినిమా ఆల్మొస్ట్ కంప్లీట్ కావొచ్చింది. ఈ నెలాఖరుతో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఏప్రిల్ నుంచి త్రివిక్రమ్ మూవీ షూటింగ్‌లో మహేష్ బాబు పాల్గొననున్నారు. ఈ సినిమాను దసరా వరకు కంప్లీట్ చేసి వచ్చే డిసెంబర్ కానీ సంక్రాంతికి గానీ ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మహేష్ బాబు. ఆ త‌ర్వాత మ‌హేష్ బాబు .. రాజ‌మౌళి సినిమా కోసం డెడికేటెడ్ గా వ‌ర్క్ చేయ‌నున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి