Home » Entertainment » Ss Rajamouli Comments On Mahesh Babu
Entertainment

SS Rajamouli : మహేష్ బాబు ఆ సినిమాని రిజెక్ట్ చేసి పెద్ద తప్పు చేసాడు.. రాజమౌళి..!

Authored By
Anusha V
The Telugu News | Updated on: November 28, 2023, 4:22 pm
Advertisement

SS Rajamouli : బాలీవుడ్ Bollywood  స్టార్ హీరో రణబీర్ కపూర్ Ranbir kapoor లేటెస్ట్ సినిమా ‘ యానిమల్ ‘ Animal Movie టాలీవుడ్ Tollywood డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటించారు. ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు రైట్స్ ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సొంతం చేసుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ క్రమంలోనే అన్ని భాషల్లోనూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని మల్లారెడ్డి కాలేజీలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి గెస్ట్ లుగా హాజరయ్యారు.

Advertisement

ఈ ఈవెంట్ లో రాజమౌళి రన్బీర్ కపూర్ ని ఒక ప్రశ్న అడిగారు. మీకు ఛాన్స్ వస్తే రాజమౌళితో సినిమా చేస్తారా లేక సందీప్ రెడ్డి వంగా తో చేస్తారా అని అడగ్గా ఇద్దరితో చేస్తాను అని రన్బీర్ చెప్పాడు. అయితే ఏదైనా ఒక ఛాయసే చెప్పాలి అంటే రన్బీర్ సందీప్ రెడ్డి వంగా తో చేస్తాను అని చెప్పారు. రాజమౌళి మాట్లాడుతూ.. మన ఆడియన్స్ ఎలా ఉంటారో, వాళ్ల ప్రేమ ఎలా ఉంటుందో, వాళ్ళ అరుపులు కేకలు ఎలా ఉంటాయో మనందరికీ బాగా తెలుసు. కానీ ముంబై నుంచి ఎవరైనా వచ్చినప్పుడు మన ఆడియన్స్ ఇలా ఉంటారు అని చూపించాలని ప్రతిసారి అనిపిస్తుంటుంది. అనిల్ కుమార్, బాబి డియోల్, భూషణ్ కుమార్ గారు వచ్చారు. వీళ్ళందరికీ మిమ్మల్ని చూపించినందుకు చాలా గర్వపడుతున్నా.

ప్రతి సంవత్సరం కొత్త కొత్త డైరెక్టర్లు వస్తారు. పెద్ద సినిమాలు తీస్తారు. సూపర్ హిట్ సినిమాలు తీస్తారు. చాలా మంచి పేరు సంపాదిస్తారు. అవన్నీ మనం చూస్తూనే ఉంటాం. కానీ కొంతమంది మాత్రమే ఇండస్ట్రీని షేక్ చేస్తారు. సినిమా అంటే ఇలాగే తీయాలి అని ఫార్ములా ఉండే డైరెక్టర్లు అప్పుడప్పుడు వస్తుంటారు. అలాంటి డైరెక్టర్లలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఆయన తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఒకరు. యానిమల్ తాలుకు ఫస్ట్ టీజర్ చూడగానే ఈ సినిమాను చూడాలనిపించింది. డిసెంబర్ ఒకటి రెండున నాకు ఒక పని పడింది. దీంతో ఈ సినిమాను 31 నైట్ సినిమా చూస్తున్నా. ఇక రన్ బీర్ కపూర్ గొప్ప నటుడు. చాలాసార్లు బాలీవుడ్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని అడిగితే రన్ బీర్ పేరే చెప్తాను. మీరందరూ ఈ సినిమాను థియేటర్ కి వెళ్లి చూడండి అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

Anusha V

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి