Chiranjeevi : ఆ విషయంలో చిరంజీవి దేనికి పనికిరాడు .. పరమ వేస్ట్ .. కామెంట్స్ చేసిన స్టార్ డైరెక్టర్ …!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 10 January 2023, 1:00 pm

Chiranjeevi : ఈ సంక్రాంతి కానుకగా చిరంజీవి ‘ వాల్తేరు వీరయ్య ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాను బాబీ దర్శకత్వం వహించాడు. అలాగే హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుంది. ఇక కీలక పాత్రలో మాస్ మహారాజా రవితేజ కూడా నటించాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో గ్రాండ్ గా జరిగింది. వైజాగ్ మొత్తం అభిమానులతో కళకళలాడింది. స్టేజ్ పైకి చిరంజీవి వస్తున్నప్పుడు ఫ్యాన్స్ గోల గోల చేశారు. కాగా ఈ ఈవెంట్లో ఈ సినిమా డైరెక్టర్ బాబీ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డైరెక్టర్ బాబీ కేవలం సినిమా గురించి కాకుండా పొలిటికల్ పాయింట్స్ మాట్లాడడంతో అందరికీ షాకింగ్ గా అనిపించింది. ఇంతవరకు బాబీ ఎప్పుడు పొలిటికల్ పరంగా మాట్లాడలేదు. అంతే కాదు స్టేజిపై ఇంతవరకు ఎవరు పొలిటికల్ పరంగా మాట్లాడలేదు. కానీ ఎవరు ఊహించని విధంగా బాబీ తన మాటల్లో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. వాల్తేరు వీరయ్య సినిమా ఈవెంట్లో బాబీ మాట్లాడుతూ చిరంజీవికి నేను పెద్ద అభిమానిని అని చెప్పుకున్నారు. ఈ సినిమా చేసేందుకు నాకు అవకాశం

star director comments about megastar Chiranjeevi

star director comments about megastar Chiranjeevi

ఇచ్చిన చిరంజీవి గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.అంతేకాకుండా అన్నయ్య మీకు పాలిటిక్స్ వన్ పర్సెంట్ కూడా సూట్ అవ్వదు. మీలాంటి మంచి వాళ్ళు ఈ రాజకీయాల్లోకి పనికిరారు. దెబ్బకు దెబ్బ మాటకు మాట మాట్లాడే మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే ఈ పాలిటిక్స్ కి సెట్ అవుతాడు అంటూ మెగా ఫ్యామిలీకి పరోక్షంగా కామెంట్స్ చేస్తున్న వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఈ క్రమంలో మెగా అభిమానులు చిరంజీవి పాలిటిక్స్ కి పనికి రారు, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సరిపోతాడని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే డైరెక్టర్ బాబీ సినిమా ఈవెంట్లో పొలిటికల్ విషయాలు మాట్లాడడం సరికాదని అంటున్నారు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి