Star Heroine : సినిమా ఛాన్స్ ఇస్తానంటే.. ఆ పనైనా చేస్తానంటున్న స్టార్ హీరోయిన్..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Star Heroine : సినిమా ఛాన్స్ ఇస్తానంటే.. ఆ పనైనా చేస్తానంటున్న స్టార్ హీరోయిన్..!

Star Heroine : మళయాళ భామ కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ క్రేజ్ దక్కించుకుంది. సొంత భాషలో కన్నా మన దగ్గరే అమ్మడికి సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది. తెలుగులో చేసిన మహానటి మూవీ అయితే ఆమెని మరో స్థాయికి తీసుకెళ్లేలా చేసింది. నటిగా తనని తాను ఆ మూవీతో ప్రూవ్ చేసుకుంది కీర్తి సురేష్. ఇక ఎలాంటి విషయంలో అయినా తన వాదన పర్ఫెక్ట్ గా వినిపించే కీర్తి సురేష్ కాస్టింగ్ కౌచ్ లాంటి […]

 Authored By ramesh | The Telugu News | Updated on :4 December 2022,9:00 pm

Star Heroine : మళయాళ భామ కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ క్రేజ్ దక్కించుకుంది. సొంత భాషలో కన్నా మన దగ్గరే అమ్మడికి సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది. తెలుగులో చేసిన మహానటి మూవీ అయితే ఆమెని మరో స్థాయికి తీసుకెళ్లేలా చేసింది. నటిగా తనని తాను ఆ మూవీతో ప్రూవ్ చేసుకుంది కీర్తి సురేష్. ఇక ఎలాంటి విషయంలో అయినా తన వాదన పర్ఫెక్ట్ గా వినిపించే కీర్తి సురేష్ కాస్టింగ్ కౌచ్ లాంటి విషయాల పైన తన కామెంట్స్ చేసింది. మీటూ.. కాస్టింగ్ కౌచ్ లాంటివి తన జీవితంలో జరగలేదని.

ఒకవేలా అలా ఎవరైన తనని అడిగితే మాత్రం అక్కడితో తన కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసేదాన్ని అని నిక్కచ్చిగా చెప్పేసింది కీర్తీ సురేష్. సినిమాలో ఛాన్స్ లు ఇస్తానంటే ఎలాంటి పాత్ర అయినా చేస్తా కానీ కాస్టింగ్ కౌచ్ లాంటివి మాత్రం తాను అసలు ఒప్పుకోనని అంటుంది కీర్తి. మొన్నటిదాకా గ్లామర్ విషయంలో కొద్దిగా వెనకడుగు వేసిన అమ్మడు ప్రస్తుతం స్కిన్ షోకి రెడీ అని చెబుతుంది. రోజుకి ఎంతోమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తుంటారు. వారిలో ఎవరు క్లిక్ అవుతారో తెలియదు అలానే తమకు వచ్చిన ఈ క్రేజ్ ని కొనసాగించాలని హీరోయిన్స్ భావిస్తారు.

Star Heroine keerthi suresh ready to do for movie offers

Star Heroine keerthi suresh ready to do for movie offers

అందుకే కీర్తి కూడా ఈమధ్య గ్లామర్ సైడ్ కూడా మెరుపులు మెరిపిస్తుంది. కీర్తి ఇలానే ఉంటే మాత్రం మరో ఐదారేళ్లు సూపర్ ఫాం కొనసాగించే ఛాన్స్ ఉంది. తెలుగు, తమిళంలో ప్రయోగాలతో కూడా ఆడియన్స్ ని అలరిస్తున్న కీర్తి సురేష్ తన మార్క్ నటనతో మెప్పిస్తూ వస్తుంది. గ్లామర్ షోకి ఓకే అంటుంది కాబట్టి కీర్తికి ఆఫర్లు కూడా భారీగా వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం నానితో దసరా మూవీ చేస్తున్న కీర్తి సురేష్ తమిళంలో మరో రెండు ప్రాజెక్ట్ లు చేస్తుంది. ప్రతి సినిమాలో తన మార్క్ చూపిస్తూ వస్తున్న కీర్తికి మరో మహానటి లాంటి సినిమా పడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది