
star writer gave big leak from mahesh rajamouli movie
Rajamouli : ఓటమి అనేది లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు రాజమౌళి. ఆయన ఏ సినిమా చేసిన కూడా అది బాక్సాఫీస్‌ని షేక్ చేయాల్సిందే. ఇటీవల ట్రిపుల్ ఆర్ సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన రాజమౌళి త్వరలో మహేష్ బాబుతో సినిమా చేసేందుకు సన్నద్దమవుతున్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం ఏకంగా ఆస్కార్ బరిలో నిలవడం, ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానులు, సినీ వర్గాలు స్పందించి ప్రశంసలు కురిపిండంతో రాజమౌళి పేరు కూడా తెగ మారుమ్రోగిపో యింది. ఆర్ఆర్ఆర్ చిత్రం జపాన్‌లోనూ విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రమోషన్ కోసం అని జపాన్ వెళ్లారు.
ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ సినిమా కోసం కొద్ది రోజులుగా పని చేస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ రేంజ్‌లో అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్ అడ్వెంచరస్‌గా ఈ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు . ఆఫ్రీకా అడవుల బ్యాక్ డ్రాప్‌లో కథ ఉంటుందని రైటర్ విజయేంద్రప్రసాద్ కూడా చెప్పారు. తాజాగా ఈ కథ నిజ జీవితం ఆధారంగా రాసుకున్నదని తెలిపారు. రిలీజ్ లైఫ్ ఇన్స్ డెంట్స్ ఆధారంగా సాగే కథ అని చెప్పారు. ఈ కథకి మహేష్ అయితే పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతాడని భావించి అతనిని ఎంపిక చేసుకున్నారట. ప్రస్తుతం తాను రాజమౌళి కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నామని, అది పూర్తవడానికి ఇంకాస్త టైమ్ పడుతుందన్నారు. మహేష్ బాబు కెరీర్‌లోనే ఈ చిత్రం అతిపెద్ద ప్రాజెక్ట్ అవుతుందని, బడ్జెట్ వైజ్‌గానూ భారీగా ఉండబోతుందని చెప్పారు.
star writer gave big leak from mahesh rajamouli movie
రాజమౌళి- మహేష్ బాబు సినిమాని వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం మహేష్‌బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో `SSMB28` చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ సిని పూర్తైన వెంటనే రాజమౌళి సినిమా స్టార్ కానుంది. ఇదిలా ఉంటే ఇందులో విలన్ పాత్రల కోసం ఇద్దరు స్టార్ హీరోలను తీసుకోబోతున్నారట జక్కన్న. తమిళ హీరో కార్తి, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.