Home » Entertainment » Stylish Promotions Of Thank You Brother By Anasuya
Entertainment

Anasuya : థాంక్యూ బ్రదర్ స్టైలిష్‌గా ప్రమోట్ చేస్తున్న అనసూయ

Authored By
vamana sai
The Telugu News | Published on: May 9, 2021, 10:40 am
Advertisement

Anasuya : థాంక్యూ బ్రదర్.. తాజాగా ఆహాలో రిలీజైన సినిమా. రిచ్‌ మ్యాన్‌ అభిగా విరాజ్‌ అశ్విన్‌, ప్రెగ్నెంట్ లేడీగా అనసూయ భరద్వాజ్‌ Anasuya నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కథలో దమ్ముంటే గానీ ఒప్పుకోని అనసూయ ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ చేసిందంటేనే కథ ఎంత విభిన్నంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం రెండు పాత్రలే ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. వాస్తవంగా థియేటర్స్ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ థియేటర్స్ మూతపడటంతో అల్లు అరవింద్ ఆహాలో రిలీజ్ చేశారు.

Advertisement

anasuya

గత ఏడాది నుంచి అద్భుతమైన కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఓటీటీ ఆహా. ఈ ఓటీటీలో వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు తెలుగు వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మరో హర్ట్ టచింగ్ కంటెంట్‌ థాంక్యూ బ్రదర్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. హిట్ టాక్ తెచ్చుకున్న థాంక్యూ బ్రదర్ సినిమాను మరింతగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు నటి అనసూయ సోషల్ మీడియాలో వినూత్నంగా ప్రమోషన్ చేస్తోంది.

Advertisement

Anasuya : థాంక్యూ బ్రదర్ సినిమాలో చేసిన గర్భినీ పాత్రకి ప్రశంసలు దక్కుతున్నాయి.

అనసూయకి  Anasuya ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా వచ్చిన థాంక్యూ బ్రదర్ లోని అనసూయ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల నుంచి గొప్ప ప్రశంసలు అందుకుంటోంది. రంగస్థలం సినిమాలో చేసిన రంగమ్మత్త పాత్ర తర్వాత మళ్ళీ ఇంతకాలానికి థాంక్యూ బ్రదర్ సినిమాలో చేసిన గర్భినీ పాత్రకి ప్రశంసలు దక్కుతున్నాయి. కాగా అనసూయ కృష్ణవంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ సినిమాలోనూ అద్భుతమైన పాత్రలో కనిపించబోతోంది.
1.

anasuya

Advertisement

 

2.

Anasuaya

 

Advertisement

3.

Anasuaya

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి