Mahesh Babu :కెమెరామెన్ అవ‌మానించ‌డంతో గ‌దిలోకి వెళ్లి ఏడ్చేసిన మ‌హేష్ బావ‌

Authored By Sam C | The Telugu News | Published on: February 10, 2022, 2:30 pm

Mahesh Babu : టాలీవుడ్ యంగ్ హీరోల‌లో సుధీర్ బాబు ఒక‌రు. ఆయ‌న మ‌హేష్ క్రేజ్ ఏ మాత్రం వాడ‌కుండా సినిమాల‌లో స‌త్తా చాటుతున్నాడు.. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేష్ బావగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తన ప్రతిభతోనే సుధీర్ బాబు హీరోగా నిలదొక్కుకున్నాడు. ఎస్ఎంఎస్, ప్రేమ కథా చిత్రం, సమ్మోహనం లాంటి హిట్స్ తో ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో దూసుకుపోతున్న సుధీర్ బాబు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు బుధవారం అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయ‌న మొదటి సినిమా ‘ఎస్ఏంఎస్ కాగా, రెండో సినిమా ‘ప్రేమ కధా చిత్రమ్’ తో కమర్షియల్ విజయాన్ని అందుకున్న ఆయన బాలీవుడ్ లో కూడా మంచి సినిమాలు చేసే స్థాయికి వెళ్ళాడు.

తాతినేని సత్య దర్శకత్వంలో శివ మనసులో శృతి అనే సినిమా చేస్తున్న సమయంలో తాను వినకూడని ఒక మాట సినిమాటోగ్రాఫర్ నోటివెంట విన్నానని సుధీర్ బాబు వెల్లడించారు. అప్పట్లో కేరవాన్ ఫెసిలిటీ లేకపోవడంతో అందరూ ఆరుబయటే ఉండేవారని ఆ సమయంలో సదరు సినిమాటోగ్రాఫర్ తన అసిస్టెంట్ తో ఈ సినిమా వర్కవుట్ కాదు ఇతని ఫేస్ ఫోటోజనిక్ గా లేదు అని చెప్పడం విన్నాను అని వెల్లడించారు.అయితే ఆ మాటలు అప్పుడు బాధ కలిగించినా తనలో ఫైర్‌ని రగిలించాయని, తాను బాగా నటించాలనే కసిని పెంచాయని తెలిపారు సుధీర్‌బాబు. ఆ స‌మ‌యంలో సుధీర్ బాబు ఏడ్చాడ‌ట కూడా. లుక్ వైజ్‌గా కనెక్ట్ కావడం కష్టమని తెలిసి, ఇక నటనపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారట. అలా తొలి సినిమా తనకు మంచి పేరు తెచ్చిందన్నారు సుధీర్‌బాబు.

Mahesh Babu sudheer babu rejects pan india movie

Mahesh Babu sudheer babu rejects pan india movie

Mahesh Babu : సుధీర్ స్ట‌న్నింగ్ ముచ్చ‌ట్లు…

రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న `బ్రహ్మాస్త్ర` భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మూవీలో విలన్ పాత్రలో నటించే అవకాశం మొదట సుధీర్ బాబుకి వచ్చింది. కానీ ఆ ఆఫర్ ని తానూ రిజెక్ట్ చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో ఇంద్రగంటిగారితో `సమ్మోహనం` ఆఫర్‌ వచ్చిందని, ఇది చాలా కూల్‌గా సాగే మూవీ అని, విలన్‌గా చేశాను, కానీ ఇలాంటి సెటిల్డ్ నటన చూపించే సినిమా చేయలేదని అందుకే `బ్రహ్మస్త్ర` రిజక్ట్ చేసి `సమ్మోహనం` ఓకే చేశానని తెలిపారు సుధీర్‌బాబు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp