Sudigali sudheer love track with varsha Extra Jabardast
Sudheer Sudheer : ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో కామెడీని పంచడంతోపాటు ప్రేమ జంటలను కూడా కలుపుతుంది అని చెప్పాలి. ఇక ఈ ప్రేమ జంటలను చూస్తే రష్మీ – సుధీర్ , వర్షా – ఇమ్మానుయేల్ , రాకేష్ – సుజాత, ఇంకా రెండు మూడు జంటలు ఉన్నాయని చెప్పాలి. ఈ జంటల మధ్య కెమిస్ట్రీని హైలెట్ చేసి కామెడీ షోలను రన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇక వీరిలో ఎవర్ గ్రీన్ , జంటగా రష్మీ – సుధీర్ పేరుపొందారు. అప్పటికప్పుడు మంచి కంటెంట్ ఇస్తూ జబర్దస్త్ ని నిలబెట్టారు అని చెప్పాలి. ఇక ఈ జంట తర్వాత ఇప్పుడు వర్ష – ఇమ్మానుయేల్ ట్రేండింగ్ గా మారారు.
అయితే ఇప్పుడు ఈ సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు రష్మీని పక్కన పెట్టి సుధీర్ వర్షాతో రొమాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే సుధీర్ కొన్నాళ్లుగా జబర్దస్త్ ను వదిలేసిన విషయం తెలిసిందే . మూవీస్ లో బిజీగా ఉండడం మరియు ఇతర టీవీ చానల్స్ లో ఆఫర్స్ రావడంతో జబర్దస్త్ ని విడిచిపెట్టాడు సుడిగాలి సుదీర్. ఇక ఇప్పుడు అవన్నీ పూర్తి చేసుకొని జబర్దస్త్ కి మరల తిరిగి వచ్చాడు సుదీర్. ఈ వారం నుండి సుడిగాలి సుధీర్ జబర్దస్త్ లో సందడి చేయబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈవారం విడుదలైన ప్రోమోలో సుడిగాలి సుదీర్ కనిపించి అందర్నీ కనువిందు చేశాడు. వచ్చి రాగానే మరల అందరిని గెలకడం మొదలుపెట్టాడు.
Sudigali sudheer love track with varsha Extra Jabardast
రష్మీ కి తన పాత డైలాగ్ తో మరల ప్రపోజ్ చేశాడు. ఇంకా తర్వాత గాలి వారి పెళ్లి పిలుపు ,అనే స్కిట్ లో వర్షాతో కలిసి స్టెప్ లేసాడు .ఈ స్కిట్ లో వర్ష ఇమాన్యుల్ పెళ్లి కి సుధీర్ కెమెరామెన్ గా చేస్తాడు. పెళ్లి ఫోటో షూట్ లో ఇమాన్యుల్ సరిగా ఫోజులు ఇవ్వకపోవడంతో సుధీర్ వెళ్లి చూపిస్తాడు. వర్షాన్ని పట్టుకొని మంచి యాంగిల్ లో రొమాంటిక్ ఫొటోస్ కి ఫోజులిచ్చాడు. దీంతో ఇమాన్యుల్ ఈ పంచ , షర్ట్ వేసుకొని నువ్వే చేసుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అసలు ఎందుకు వచ్చావురా నువ్వు అంటూ విరుచుకుపడతాడు. దీంతో స్టేజ్ అంతా నవ్వులతో దద్దరిల్లిపోయింది. ఆ తర్వాత ఈవెంట్ మేనేజర్ భాస్కర్ మంచి ఆర్కెస్ట్రా ఉంది అద్భుతంగా పాటలు , పాడతారని చెప్పడంతో ఇమాన్యుల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు.
మరల సుధీర్ వచ్చి వర్ష పక్కన కూర్చొని ” నాతో వస్తావా” “నాతో వస్తావా” అంటూ పాట పాడుతుండగా దానికి వర్షా కూడా తలుపుతూ తాను కూడా సాంగ్ ని పాడుతుంది. ఆ తర్వాత ఇమాన్యుల్ కూడా పాటను అందుకొని మరింత రెచ్చిపోయాడు. సుధీర్ దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నావురా అంటూ ప్లేట్ తీసుకొని కొడతాడు. కామెంట్స్ పెట్టిస్తావా పెట్టించు నేను భయపడను అంటూ ఇమాన్యుల్ అంటాడు. ఇక తర్వాత ఆఖరిలో సుధీర్ మరోసారి రష్మీ తో డ్యూయెట్ చేశాడు. ఇక ఇది ప్రోమోలో హైలెట్గా నిలిచింది. అయితే ప్రస్తుతం సుడిగాలి సుదీర్ గాలోడు అనే సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈనెల 18 వ తేదీన విడుదల కాబోతుంది. అయితే సినీ ప్రమోషన్ కోసం సుడిగాలి సుదీర్ జబర్దస్త్ షోలో సందడి చేసినట్లుగా సమాచారం. గాలేడు యూనిట్ తో కలిసి జబర్దస్త్ లో కనిపించాడు. అయితే సుధీర్ జబర్దస్త్ షోలో మరల కంటిన్యూ అవుతాడా? లేదా కేవలం ప్రమోషన్ పరిమితమే జబర్దస్త్ షో కి వచ్చాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది .
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.