sneha clears the all rumors
Sneha : దివంగత హీరోయిన్ సౌందర్య తర్వాత ఆ స్థాయిలో తెలుగు సినీ ప్రియుల మదిని దొచుకున్న అందాల ముద్దుగుమ్మ స్నేహ. రాధ గోపాలం.. శ్రీరామదాసు.. వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ భామ తెలుగు, తమిళ్ భాషలలో నటిస్తూ కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే హీరో ప్రసన్న కుమార్ ను 2011లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం మనందరికి విదితమే. ప్రస్తుతం వీరికి బాబు, పాప ఉన్నారు. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న స్నేహ.. ఇప్పుడిప్పుడే పలు సినిమాలలో రీఎంట్రీ ఇస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంతో పాటు అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాల్లో కీలకపాత్రలలోను నటించి మెప్పించింది.
అందం, అభినయంతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న స్నేహ… గ్లామర్ పాత్రలు కాకుండా హోమ్లీ పాత్రలను ఎంచుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్ మనసులు దొచుకుంది. ప్రేమ కథలలో మాత్రమే కాకుండా మంచి భక్తిరస చిత్రాలలో కూడా నటించి గుర్తింపు అందుకుంది. తెలుగులో శ్రీరామదాసు సినిమాలో ఆమె నటించిన విధానానికి ప్రతి ఒక్కరు అప్పట్లో ఆశ్చర్యపోయారు. రవితేజతో చేసిన వెంకీ సినిమా కూడా ఆమెకు మంచి సక్సెస్ ను అందించిందనే చెప్పాలి.
sneha clears the all rumors
అయితే కొద్ది రోజులుగా స్నేహా, ఆమె భర్త విడిపోయినట్టు జోరుగా ప్రచారాలు వచ్చాయి. ఈ క్రమంలో తమ బంధం గురించి వస్తున్న రూమర్స్ పై ఎట్టకేలకు హీరోయిన్ స్నేహ సోషల్ మీడియా ద్వారా స్పందించింది.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్నేహ తన భర్త ప్రసన్నతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. భర్తని హగ్ చేసుకుని చాలా క్లోజ్‌గా, ప్రేమగా ముద్దు పెడుతున్న పిక్ ని పంచుకుంటూ `ట్విన్నింగ్` అంటూ పోస్ట్ షేర్ చేసింది.. వీకెండ్ సందర్భంగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నామనే అర్థంలో స్నేహ ఈ పోస్ట్ ఉంది.. ప్రస్తుతం ఇది వైరల్ అవుతూ, డైవర్స్ రూమర్స్ చెక్ పెట్టిందని పలువురు చర్చించుకుంటున్నారు.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.