Home » Entertainment » Sudigali Sudheer And Aadi Fun On Doops In Sridevi Drama Company
Entertainment

Sudigali Sudheer : పిలిచి మరీ పరువుతీశారు.. ఆది, సుధీర్ మామూలోళ్లు కాదు!

Authored By
Cinema Desk
The Telugu News | Published on: September 15, 2021, 8:45 am
Advertisement

sudigali sudheer and aadi : సెలెబ్రిటీలను పోలిన వ్యక్తులు అక్కడక్కడా మనకు కనిపిస్తుంటారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ ఇలా స్టార్ హీరోల్లా కనిపించే డూపులకు ఒకప్పుడు ఎంత క్రేజ్ ఉండేదో అందరికీ తెలిసిందే. నాటక రంగం హవా కొనసాగినప్పుడు వారికి ఉన్న డిమాండ్ వేరే లెవెల్. కానీ ఇప్పుడు ఆ డూపులకు, హీరోల్లో కనిపించే సాధారణ వ్యక్తులకు విలువే లేకుండాపోయింది. ఇక ఆ మధ్య టిక్ టాక్ మంచి ఊపులో ఉన్న సమయంలో అయితే కుర్ర హీరోల పోలికలతో ఉన్న వ్యక్తులు నానా రచ్చ చేశారు.

Advertisement

 

sudigali sudheer and aadi fun on doops in sridevi drama company

Advertisement

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా హీరోలకు డూపుల్లా టిక్ టాక్‌లో కొన్ని లక్షల వీడియోలు చేశారు. వారు బాగానే ఫేమస్ అయ్యారు. కానీ టిక్ టాక్ అర్దాంతరంగా మూత పడిపోయింది. దాంతో ఎంతో మంది మూలన పడ్డారు. కానీ టిక్ టాక్ వల్ల ఎంతో మంది ఫేమస్ అయ్యారు. కొందరికి సినిమాల్లో చాన్స్ వచ్చింది. ఇంకొందరికి బుల్లితెరపై అవకాశాలు వచ్చాయి. అలా టిక్ టాక్ భాను, దుర్గారావు వంటి వారు బాగానే ఫేమస్ అయ్యారు.

 

Advertisement

sudigali sudheer and aadi fun on doops in sridevi drama company

 

sudigali sudheer and aadi : ఆవేశం స్టార్‌ను ఆడుకున్న ఆది :అయితే అందులో ఆవేశం స్టార్ కూడా ఉన్నాడు. తాజాగా అతడిని సుధీర్‌కు డూప్ అంటూ శ్రీదేవీ డ్రామా కంపెనీలోకి ఆది తీసుకొచ్చి పరువుతీశాడు. ఇక సుధీర్ సైతం ఆదిలా ఉండే ఓ వ్యక్తిని తీసుకొచ్చాడు.

 

Advertisement

sudigali sudheer and aadi fun on doops in sridevi drama company

మొత్తానికి అలా స్టేజ్ మీదకు వాళ్లను పిలిచి పరువుతీసేశారు. ఆవేశం స్టార్‌ను అందరూ కలిసి దారుణంగా ఆడుకున్నారు. అతని మాట తీరు, ఆహార్యం అన్నింటిపైనా కౌంటర్లు వేశారు. మొత్తానికి సుధీర్, ఆదిలు మాత్రం దారుణంగా వారిని కామెంట్ చేసేశారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి